GuidePedia

0

హీరోయిన్ గా మారుతున్న సమంత సిస్టర్ !!

శ్రీదేవి నుంచి మీనా, రాశి, రోహిణి ఇలా చాలామంది బాలతార నుంచి భావితరం నాయికలుగా ఎదిగిన వారే. ఈ కోవలోకి తాజాగా మరో ఉత్తరాది భామ చేరింది. ఈ అమ్మడి పేరు నవిక కోటియా. ఈ పేరు చెబితే అంతగా గుర్తుకు రాకపోవచ్చు. ఇంగ్లీష్ వింగ్లీష్ చిత్రంలో శ్రీదేవి కూతురుగా నటించిన బాలతారనే ఈ నవిక. ఆ చిత్రంలో ఆంగ్లభాష తెలియని తల్లి శ్రీదేవిని చులకనగా చూసి ఆ తరువాత అమ్మ ఆంగ్లం నేర్చుకుని సరళంగా మాట్లాడినపుపడు సారీ చెప్పిన పాత్రలో నవిక బాగానే రిజిస్టర్ అయ్యింది. అలాగే మన అత్తారింటికి దారేది సినిమాలో సమంత, ప్రణీత ల చెల్లిగా కూడా నటించింది. కాగా నవిక మురుగాట్రుపడై అనే చిత్రంతో హీరోయిన్‌గా తెరపైకి రానుంది. నవ నటుడు శరవణన్ హీరోగా పరిచయమవుతున్న ఈ చిత్రా న్ని శిఖరం విజువల్ మీడియా సంస్థ నిర్మిస్తోంది. పలు చిత్రాలకు ప్రొడక్షన్ నిర్వహణ బాధ్యతల్ని నిర్వహించిన కె.మురుగానందం ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఒక యూత్‌ఫుల్ చిత్రాల ద్వారా హీరోయిన్‌గా పరిచయం కావడం ఆనందంగా ఉందని నటి నవిక కోటియా పేర్కొన్నారు.

Post a Comment

 
Top