GuidePedia

0

ఆమె ప్రెగ్నెంట్ కాదంటా !!

టాలీవుడ్, కోలీవుడ్ లో కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా చేసి ఈమధ్యనే పెళ్లి చేసుకున్న అమలాపాల్ గర్భావతి అయింది అని గత రెండు రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈమధ్యనే పెళ్లి అయిన అమలా అప్పుడే తల్లి అవుతుందనే విషయం టాలీవుడ్ మరియు కోలీవుడ్ ఇండస్ట్రీలో చర్చనీయంశంగా మారింది. అయితే తానూ గర్భవతినని వస్తున్న వార్తలని అమలాపాల్ ఖండించింది. ‘విజయ్ నుంచి ఓ అపురూపమైన బహుమతి పొందానని అంటే మీడియా తప్పుగా అర్ధం చేసుకున్నదని , నా ఉద్దేశం మరొకటి’ అని చల్లగా చెప్పింది అమలా. ఆమె చెప్పిన దాని ప్రకారం ఎవరైనా ఆమె గర్భవతి కాబోతుందనే అనుమానిస్తారు. కానీ తన ఉద్దేశం అది కాదని చెప్పుకొచ్చింది. అమలాపాల్ ఎందుకు మాట  మార్చింది అనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తి విజయ్ ని ఈమె పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.

Post a Comment

 
Top