చేకోడి రేటింగ్ : 2.5/5
చిత్రం : కార్తికేయ
బ్యానర్ : మగ్నుస్
సినీ ప్రైమ్
సంగీతం : శేకర్
చంద్ర
ఛాయాగ్రహణం : కార్తీక్
గట్టమనేని
ఎడిటర్ : కే
శ్రీనివాస్
నిర్మాత : వెంకట
శ్రీనివాస్
రచన,దర్శకుడు : చందు మొండేటి
నటినటులు : నిఖిల్
సిద్దార్థ్, స్వాతి రెడ్డి, సత్య, ప్రవీణ్, తనికెళ్ళ భరణి, రావు రమేష్, కిషోర్,
తులసి, రఘు తదితరులు
స్వామి రారా తో మంచి హిట్
అందుకున్న దాదాపు ఏడాదిన్నర గ్యాప్ తర్వాత ఈ సారి మళ్ళీస్వాతి తో కలసి ‘కార్తికేయ’
అనే పేరు తో వచ్చాడు. చందు మొండేటి ఈ చిత్రానికి
దర్శకత్వం వహించారు. వెంకట్ శ్రీనివాస్
బొంగరం చిత్రాన్ని నిర్మించారు. దాదాపు ఏడాది కిందే సినిమా పూర్తయినా.. సాంకేతిక ఇబ్బందుల వల్ల ఈ చిత్రం
ఇప్పటికి అంటే 24.10.2014న విడుదలైంది. ఆ విశేషాలు ఏమిటో చూద్దాం.
కథ
: మెడికో
కార్తీక్ (నిఖిల్) ది ఏదైనా సందేహం వస్తే, దానికి సమాధానం అన్వేషించడానికి
ఎంతదూరమైనా వెళ్లే రకం. అలాంటి మన హీరో మెడికల్ క్యాంప్ కోసం అని సుబ్రహ్మణ్యపురం అనే ఊరికి వెళ్లాల్సి వస్తుంది. అప్పటికే ఆ ఊళ్లో మూతబడిన
సుబ్రమణ్యేశ్వరస్వామి గుడి ఉంటుంది. ఆ గుడికో
మిస్టీరియస్ ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. ప్రతీ కార్తీక పౌర్ణమికి గుడి మొత్తం ప్రకాసిస్తూంటుంది. మూతబడిన ఆ గుడిని తెరవాలని
ప్రయత్నించేవారంతా పాము కాటుతో మరణిస్తూంటారు. ఈ
విషయం తెలుసుకున్న కార్తీక్ ఎలా స్పందించాడు. ఆ మిస్టరీ వెనక ఉన్న అసలు నిజం ఏంటనేది ఎలా తెలుసుకున్నాడు.
ఆ ప్రాసెస్ లో ఏం జరిగిందనేది,కథలో వల్లి(స్వాతి) పాత్ర ఏమిటి... వంటి విషయాలు తెలియాలంటే చిత్రం చూడాల్సిందే.
నటినటులు : నటనాపరంగా నిఖిల్ 'హ్యాపీ డేస్' నుంచి చాలా ఎనర్జిటిక్‌గా వుండేవాడు. కానీ 'కార్తికేయ' చిత్రంలో మాత్రం.. పరిమితి పొందాల్సి వచ్చింది. ఒక బాధ్యతగల పాత్రగా దర్శకుడు చందును తీర్చిదిద్దాడు. మొదటి భాగంలో చాలా సరదాగా చేసే పాత్రను సెకండాఫ్‌లో కొంచెం సెంటిమెంట్ టచ్‌తో చూపించాడు. ప్రతి ప్రశ్నకు సమాధానం ఉంటుందని నమ్మే క్యారక్టరైషన్లో పర్ఫెక్ట్ గా ఓదిగిపోయాడు.
నటినటులు : నటనాపరంగా నిఖిల్ 'హ్యాపీ డేస్' నుంచి చాలా ఎనర్జిటిక్‌గా వుండేవాడు. కానీ 'కార్తికేయ' చిత్రంలో మాత్రం.. పరిమితి పొందాల్సి వచ్చింది. ఒక బాధ్యతగల పాత్రగా దర్శకుడు చందును తీర్చిదిద్దాడు. మొదటి భాగంలో చాలా సరదాగా చేసే పాత్రను సెకండాఫ్‌లో కొంచెం సెంటిమెంట్ టచ్‌తో చూపించాడు. ప్రతి ప్రశ్నకు సమాధానం ఉంటుందని నమ్మే క్యారక్టరైషన్లో పర్ఫెక్ట్ గా ఓదిగిపోయాడు.
స్వాతి పాత్రకు
పెద్దగా స్కోప్ లేదు ఆమె ఆ పాత్రకి సూట్ కాలేకపోయింది. హీరోతో ట్రావెల్ అయ్యే
పాత్ర అంతే. ప్రవీణ్, సత్య సినిమా మొత్తం
ఉన్నావారి కామెడీ ఎక్కడ పేలలేదు. రావురమేష్, జోగినాయుడు, తులసి, గిరి, జయప్రకాష్‌లు
తమ పాత్రల పరిధిమేరకు నటించారు.
సాంకేతిక
వర్గం : కేమెరాపనితనం చాలా బాగుంది. ఇచ్చిన
బడ్జెట్ లో ప్రతిషాట్‌ను అద్భుతంగా తీశాడు.
నైట్ ఎఫెక్ట్ లో సీన్స్ తీయడం ఆకర్షణీయంగా వున్నాయి. సంగీతపరంగా ఈ చిత్రంలో ఓ సాంగ్.. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌ను బాగా ఇచ్చాడు. ఎడిటింగ్ సోసో. ప్రొడక్షన్
వాల్యూస్ పర్వాలేదు. గ్రాఫిక్స్ అక్కడక్కడా బావున్నాయి. ఆర్ట్ డిపార్ట్ మెంట్
పనితం చాలా బాగుంది. ధర్శకుడు చందు కధను చాలా కన్విస్సింగ్ రాసుకోగలిగాడు. ఎక్కడా
లాజిక్ మిస్ కాకుండా కామన్ ఆడియెన్స్ ను
ధ్రిల్ చేసేలానే స్ర్కీన్‌ప్లే ఉంది. కానీ కామెడీ
లేకపోవటం కాస్త వెలితిగా అనిపిస్తుంది. ఓ విదంగా ఎంటర్‌టైన్‌మెంట్ పేరుతో ఏదెదో చేయకుండా తన మెయిన్ ఫోకస్
అంతా కాన్సెప్ట్ మీదే పెట్టాడు. చివరివరకు
అదే ధ్రిల్‌ను,సస్పెన్స్ను మైంటేన్ చేయలేకపోయాడు రావు రమేషే విలన్ అనే సంగతి అతడి స్వభావాన్ని
బట్టి తెలిసిపోతుంది. డైలాగ్స్ పరంగా దర్శకునికి మార్కులు పడతాయి. 'ఆడపిల్లకు బస్సులోనూ, బయట కూడా సేఫ్టీ లేకుండా పోతుంది. అలాంటిది తల్లి కడుపులో కూడా సేఫ్టీ లేకపోతే ఎలా?' అనే డైలాగ్... సన్నివేశపరంగా బాగా ఆకట్టుకుంది. ఇలాంటి డైలాగ్‌లు మితమైన సంభాషణలు ఇందులో
వున్నాయి.
ప్లస్ పాయింట్స్ :
·
సినిమాటోగ్రఫీ
·
మ్యూజిక్
·
సినిమా రన్ టైం
డ్రా బాక్స్ :
·
క్లైమాక్స్
·
పేలని కామెడీ
విశ్లేషణ
: దేవుడిపై
నమ్మకం, నమ్మకం లేకపోవడం అనే కాన్సెప్ట్‌లు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా డీల్
చేయాలి. మొదటి భాగంలో దర్శకుడు చందు చాలా
పరిణితి చెందినవాడిలా చూపించాడు. సెకండాఫ్‌లో దాన్ని ఇంకెంత బాగా తీస్తాడో అనిపించేలా వుంది. అడుగడునా
ఇంట్రెస్ట్ క్రియేట్ చేసినా .. రెండో
భాగంలో ఒక్కసారిగా ముగింపు ఆసక్తి తగ్గింది. దైవమే మనిషిని నడిపేది. ఆ దేవుడిని నమ్ముకుంటే ఏదైనా జరుగుతుందని చెప్పే
కాన్సెప్ట్ ఇది. దేవుడు, దెయ్యం లేదని నేటితరం యువత... మూసివేసిన ఆలయంలోని
రహస్యాన్ని ఎలా ఛేదించాడనేది ముగింపు. అయితే..
ముగింపులో ఎండోమెంట్ అధికారే దేవాలయంలోని
విలువ కట్టలేని వజ్రం సొంతం చేసుకోవాలనే కాంక్షతో విదేశీయులతో చేతులు కలిపి కాజేయాలనుకుంటాడు. దానికి ప్రజల్లో సెంటిమెంట్
కలగజేసి... దాన్ని స్వలాభానికి
ఉపయోగించుకోవాలనుకుంటాడు. ఇలాంటి కాన్పెప్ట్.. బ్లాక్ అండ్ సినిమాల నుంచి వచ్చినవే ఆ పాత్రని చూడగానే మనకు
తెలిసిపోతుంది. కానీ మొదటి భాగంలో చూపించిన ఇంట్రెస్ట్... సెకండాఫ్‌లో తేల్చేయడంతో ఆ ఇంట్రెస్ట్ క్యారీ కాలేకపోయింది. ఈ సినిమాలో చాలా లాజికల్
పాయింట్స్ ని పర్ఫెక్ట్ గా రివీల్ చేసిన డైరెక్టర్ కొన్ని కొన్నిటిని మాత్రం వదిలేసాడు. ఉదాహరణకి ఆ పోలీస్
ఆఫీసర్ వెహికల్ తో సహా అలా ఎలా చనిపోయాడనేది
చెప్పలేదు. అతని మరణం వెనుక ఉన్న కారణం కూడా చెప్పలేదు. ఇకపోతే ఓవరాల్ గా సినిమా చూసాక ఇలాంటి
కాన్సెప్ట్ తో వచ్చిన సినిమాలు గతంలో కూడా
ఉన్నాయి కదా అనే భావన కొంతమందికి కలుగుతుంది. రెగ్యులర్ మాస్ మసాలాలన ఆశించకుండా
ఓ వెరైటీని స్టోరీని చూశామన్న ఫీల్‌ను కలిగించే
చిత్రం. మీ టిక్కేట్ రేట్‌కు తగ్గ శాటిస్‌ఫ్యాక్షన్‌ను మాత్రం అందించగలిగే సినిమా. వన్ టైమ్ వాచ్.
Post a Comment