GuidePedia

0
పోకిరి 2 ఆలోచనలో మహేష్ - పూరి
పోకిరి 2007 లో వచ్చిన ఈ సినిమా అప్పటి వారకి ఉన్న రికార్డ్స్ అన్నింటిని తిరగరాసి తెలుగు సినిమా స్టామినా చూపిన చిత్రం ఇది. ఒక్కడు సినిమా తరువాత మహేష్ బాబు కెరీర్ ని మలుపు తిప్పిన చిత్రం పోకిరి. మహేష్ బాబు కి ఈరోజు ఈ రేంజ్ స్టార్ డం దక్కడానికి ఆ మూవీ ఏ కారణం. అందుకే మహేష్ బాబు దర్శకుడు పూరీజగనాథ్ కాంబినేషన్ కి అంత క్రేజ్.  వీరి కాంబినేషన్లో వచ్చిన రెండో సినిమా బిజినెస్ మెన్ కూడా ఓ మోస్తరు విజయం సాధించింది. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి మహేష్ బాబు, పూరీ కాంబినేషన్ కి అంత సెట్ అయిపోయిందట. పూరీ దర్శకత్వంలో తాజాగా నటించేందుకు మహేష్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఈ సినిమా ‘పోకిరి’కి సేక్వేల్ గా చేస్తారని ఫిలిం నగర్లో  టాక్. ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందనేది త్వరలోనే తెలియనుంది.

ప్రస్తుతం మహేష్ బాబు కొరటాల శివ సినిమాలో నటిస్తున్నాడు. ఆ తరువాత వివి వినాయక్ దర్శకత్వంలో కూడా ఒక మూవీ ప్లాన్ చేస్తున్నారని టాక్. ఈ రెండు సినిమాల షెడ్యుల్ బట్టి పూరీజగనాథ్ సినిమాని ప్లాన్ చేస్తాడట. పూరీ స్పీడ్ గా సినిమాలు పూర్తి చేస్తాడు కాబట్టి పోకిరి-2 కు డేట్స్ ఇవ్వడం సులువే.

Post a Comment

 
Top