స్పెషల్ రిపోర్ట్ - గోవిందుడు అందరివాడేలే
ఫ్యామిలీ సినిమాలని
అద్భుతంగా తెరకెక్కించడంలో డైరెక్టర్‌గా
కృష్ణవంశీకి తెలుగులో సాటి పోటి ఎవరు లేరనే విషయం తెలిసిందే. గతంలో ఆయన
దర్శకత్వంలో వచ్చిన నిన్నే పెళ్లాడతా, ఖడ్గం, సింధూరం, మురారి, చందమామ వంటి చిత్రాలు
అందుకు కొన్ని ఉదాహరణలు. అటువంటి డైరెక్టర్
దర్శకత్వంలో రామ్ చరణ్ సినిమా అనగానే అటు అభిమానుల్లో, ఇటు ప్రేక్షకుల్లో ఓ రకమైన మిక్సడ్ వినిపించింది. '' చరణ్ కి ఉన్న
మాస్ ఇమేజికి ఇటువంటి ఫ్యామిలీ సినిమాలు అసలు సుటవవు '' అని కొందరంటే.. ''ఏ హీరో అయినా
ఏదో ఓ రోజు తమ స్టైల్ మార్చుకోవాల్సిందే
కదా.. అలాగే ఇప్పుడు చరణ్ కూడా తనలోని ఇంకో కొత్త కోణాన్ని చుపిస్తాడులే'' అని ఇంకొందరన్నారు. ఇలా రకరకాలా వాదనలు.
ఇలాంటి తీర్పుల మధ్య రిలీజ్ అయిన గోవిందుడు అందరివాడేలే మాత్రం ఆశించినంత ఫలితాన్నివ్వలేకపోయింది. రెండు వేర్వేరు
కాంబినేషన్స్ ఒక్క చోట చేరిన సినిమా కావడంతో
ఆడియెన్స్ కానీ అభిమానులు కానీ ఈ మూవీపై భారీ కమర్షియల్ అంచనాలైతే పెట్టుకోలేదుకానీ మాంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అవుతుందని ఆశించారు. కానీ వాస్తవానికి థియేటర్‌లో అలాంటి
సీనేమీ కనిపించలేదని టాక్. రొటీన్ ఫ్యామిలీ స్టోరీకి తోడు ఫస్ట్ హాఫ్ అంతా ల్యాగ్
అవగా... సెకండ్ హాఫ్‌లో ఒక్క సీన్ మినహా
కృష్ణవంశీ మార్క్ మైమరిపించేంత గొప్పగా ఏమీలేదంటున్నారు. ఒక 'నీలిరంగు చీర...' పాటలో తప్ప మిగతా పాటల్లోనూ అంతగా పసలేదట. కృష్ణవంశీ గత చిత్రాల మాధుర్యం 'గోవిందుడు'లో లోపించడం వారిని కొంత నిరాశకు గురిచేసే అంశం. ఇక చేసేదేం లేక కనీసం
ఏదో ఓ ఒకచోటైనా కృష్ణవంశీ-చెర్రీల మార్క్ సీన్‌ని
వెతుక్కుందామని సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి
ఏర్పడిందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ఇది ఎవరో ఇస్తున్న విశ్లేషణలు కాదు.. థియేటర్ నుంచి బయటికి వచ్చిన సగటు
అభిమాని చెబుతున్న మాటలు.
కథలో భాగంగా
ప్రకాష్ రాజ్ హాస్పిటల్ ని ఎప్పుడో 1952(అంకె
సాక్షo)లో కట్టిస్తాడు. చరణ్
తండ్రి అప్పడు
విదేశాలకు వెళ్లాడన్నమాట. పోనీ అక్కడకు వెళ్లిన పదేళ్లకు పిల్లాడిని కన్నా, 1962లో పుట్టినట్లు.
వాడికి పాతికేళ్లు వచ్చి ఇండియా
వచ్చాడంటే. 1988నాటికి అన్నమాట పోనీ 88దే అనుకుందామంటే ఫోన్స్, టాబ్స్, లాప్స్ ఇలా అన్ని ఈ
కాలానికి సంభందించిన పరికరాలే వాడతారు. ఇదే ఎవరికీ అర్థంకానీ ప్రశ్న... సినిమా విషయాలో
క్రియేటివ్ డైరెక్టర్ గా పేరున్న కృష్ణవంశి ఇలా అలోచించడెంటి అని కొందరు అంటుంటే
మరి కొందరు అతగాడి లోని క్రియేటివ్ పవర్ పోయిందేమో అని మరి కొందరు అంటున్నారు. 1988
ఆ లెక్కన కథాకాలం ఆ నాటిదే కావచ్చు అందుకే
సినిమా కూడా
అలాగే వుంది అని చాలా మంది పెదవి విరుస్తున్నారు.
ఈ మూవీలో మరో
అసలు సమస్య అంతగా కామెడీ లేకపోవడమేనట. పెద్దపెద్ద హీరోలు సైతం కామెడి కంటెంట్‌తో బండి నెట్టుకురావాలని
చూస్తున్న ప్రస్తుత తరుణంలో అసలు
కామెడీయే లోపిస్తే ఇక ఆ ప్రయాణం ఎంత కష్టంగా వుంటుందో చెప్పండంటున్నారు ఫ్యాన్స్. ఇక శ్రీకాంత్ విషయానికొస్తే, ఈ సినిమాలో.. ఈ పాత్రకు ఆయన
తప్ప మరెవ్వరూ సూట్ కారేమోననేంత గొప్పగా చేశాడంటున్నారు. ఇక్కడ గుర్తు చేసుకోవాల్సిన మరో విషయం ఏంటంటే.. చరణ్ ఈ సినిమా
కచ్చితంగా ఓ అగ్ని పరీక్షేనని సినిమా రిలీజ్‌కి
ముందు చర్చ జరగడం. ఎందుకంటే మొదటిసారి తన ఇమేజ్, ట్రెండ్ మార్చుకోవాలని కృష్ణవంశీ మూవీకి సైన్ చేసిన చెర్రీ అందులో ఎంతమేరకు సక్సెస్ అవుతాడోనని ప్రీ రిలీజ్ రివ్యూలు
రావడం ఇప్పుడు గుర్తుకొస్తోంది. ఇక వీటన్నింటినీ
పక్కనబెడితే, ఈ గోవిందుడిని అందరివాడిని చేయడానికి చాలా పబ్లిసిటీ అవసరమేమోననే టాక్ వినిపిస్తోంది.
Post a Comment