GuidePedia



మాజీ భర్త, జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో దాంపత్య జీవితాన్ని సాఫీగా కొనసాగించలేకపోయిన ప్రముఖ నటి రేణు దేశాయ్...ఇప్పుడు ఆయనతో కలిసి రాజకీయ సాన్నిహిత్యాన్ని కోరుతోందని టాక్. ప్రస్తుతం సినిమా నిర్మాణ రంగంలో బిజీగా ఉన్న రేణు భవిష్యత్‌లో రాజకీయ అరంగేట్రం చేయాలని భావిస్తోందట. ఇప్పటికే ఆమె బీజేపీ అగ్రనేతలతో టచ్‌లో వున్నట్టు చెబుతున్నారు. త్వరలోనే ఆమె మోడీని కలిసే అవకాశం ఉందంటున్నారు. అయితే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించడం...ఆ వెంటనే బీజేపీకి మద్దతు పలకవడంతో తన మాజీ భర్తపై రేణు దేశాయ్ కన్నుపడిందని అంటున్నారు.అందుకే పవన్ అంటే పొసగని ఆమె ఇప్పుడు పనిగట్టుకుని మరీ ప్రశంసలు గుప్పిస్తోందంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ గురించి రేణు దేశాయ్ మాట్లాడుతూ...‘పవన్ కళ్యాణ్ చాలా ఉదారమైన, ఉదాత్తమైన, వినయపూర్వకమైన, నిష్కళంకమైన వ్యక్తి.  తామిద్దరి జీవితంలో ఏం జరిగిందో తమకు మాత్రమే తెలుసు. తామిద్దరి జీవితంపై కామెంట్ చేసే అర్హత ఈ ప్రపంచంలో ఎవరికీ లేదు. సొసైటీకి ఏదో చేయాలని మనస్ఫూర్తిగా, నిజాయితీగా తపించే పవన్ కళ్యాణ్ అంటే తనకు చాలా గౌరవం. ఆయనను తాను ఆరాధిస్తాను’ అంటూ చెప్పుకొచ్చింది.
 
Top