GuidePedia

0

ఆ హీరోయిన్ ని వేధించి అరెస్ట్ అయ్యాడు

స్నేహా ఉల్లాల్ కు అవకాశాలు లేకపోయినా సెలబ్రెటీగా తలనొప్పులు మాత్రం తప్పేటట్లు కనపడటం లేదు. ఎవరో ఓ వ్యక్తి ముంబై బంద్రాలో ఉంటున్న ఆమె ఇంట్లోకి శనివారం లోపలకి రావటానిక ప్రయత్నించాడట. సెక్యూరిటీ గార్డ్, చుట్టుప్రక్కల వాళ్లు కలిసి అతనిక బుద్ది చెప్పారట. ఆ తర్వాత లోకల్ పోలీస్లు ఎంటరవటంతో వారికి అప్పచెప్పారు. ఆ వచ్చిన అపరిచితుడు...వెర్షన్ ఏమిటంటే..తనను స్నేహ ఉల్లాల్ స్వయంగా రమ్మని చెప్పిందని, ఇద్దరం పెళ్ళి చేసుకుందాం అందని పోలీసులకు చెప్పాడుట. తర్వాత స్నేహ ఉల్లాల్ మాట్లాడుతూ... వినాయిక చవితి తర్వాత ఎవరో ఓ వ్యక్తి నాకు ఫోన్ చేసి నేను మీ అభిమానిని అనేవాడు. తర్వాత మిమ్నల్ని కలవాలి అనేవాడు.,మా నానమ్మను కూడా తీసుకువస్తాను అనేవాడు. తర్వాత తరచూ ఫోన్స్ చేయటం మొదలెట్టాడు. కొన్నాళ్ళ తర్వాత తనను కలవకపోతే చంపేస్తానని ఫోన్ చేయటం మొదలెట్టాడు. తర్వాత నెంబర్ బ్లాక్ చేసాను. అయితే వేరే వేరే నెంబర్ల నుంచి ఫోను చేసేవాడు. ఇప్పుడేమో నా ఇంటికే వచ్చేసాడు. చాలా తక్కువ మందికి మా ఇంటి అడ్రస్ తెలుసు. అది కూడా తెలుసుకుని వచ్చేసాడు. దాంతో నేను షాక్ అయ్యాను. ఇప్పుడు పోలీసులు పట్టుకెళ్ళారు. రిలీఫ్ గా ఉంది. దాదాపు నెల నుంచి బయిటకు రావటానికి కూడా భయపడుతున్నాను. ఈ టెన్షన్ నుంచి నేను తేరు కోవటానికి ఎంత కాలం పడుతుందో అంది.


Post a Comment

 
Top