హిందీ దృశ్యంలో సొనక్షి సిన్హా !!
మొహన్ లాల్ హీరోగా ఆమధ్య వచ్చిన చిత్రం దృశ్యం. ఈ
సినిమా అక్కడ భారీ
విజయాన్ని అందుకుంది. దాంతో ఈ సినిమా అన్ని పరిశ్రమల్లో రీమేక్ అవుతుంది. ఈమధ్యనే
తెలుగులో వెంకటేష్ హీరోగా రీమేక్ చేసి హిట్ అందుకున్నారు. అలాగే కన్నడలో కూడా
రీమేక్ అయ్యి సూపర్ హిట్ అయ్యింది. ఇక తమిళంలో ప్రస్తుతం కమల హసన్ హీరోగా
పాపనాశం పేరుతొ రీమేక్ చేస్తున్నారు.ఈ సినిమా వచ్చే ఏడాదిలో వస్తుందని తెలుస్తుంది. ఇదిలా
ఉంటె బాలీవుడ్లో కూడా అజయ్ దేవగన్ హీరోగా ఈ సినిమా రీమేక్ అవుతున్నట్లు
తెలుస్తుంది. అలాగే ఈ సినిమాలో హీరోయిన్ గా సోనాక్షి సిన్హా నటించే అవకాశం
ఉన్నట్లు బిటౌన్ టాక్. ఇదే కానీ నిజమైతే ఓ టీనేజ్ అమ్మాయికి తల్లిగా కనిపించే
అవకాశం ఉంది. ఈ
రీమేక్ సంబందించిన మరిన్ని వివరాలు త్వరలో అధికారికంగా బయటకు వచ్చే అవకాశం
ఉన్నది. అయితే కథలో చిన్న మార్పులు చేసి , సినిమాని కమర్షియల్ , ఫ్యామిలీ డ్రామాగా రూపొందిస్తారని
బిటౌన్ టాక్ .
Post a Comment