GuidePedia

0


 ఆ ఇద్దరికి  హ్యాండ్ ఇచ్చింది !!

భారీ బడ్జెట్ తో వచ్చిన బెల్లంకొండ శ్రీనివాస్ తొలి సినిమా అల్లుడు శీనుఏవరాజ్ అయింది. దీంతో నిర్మాతగా ఉన్న సురేష్ కు కొంచం ఆర్ధిక ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇదే సమయంలో నిర్మాతగా ఉన్న రభససినిమా కూడా ఫ్లాప్ కావటంతో సమస్యలు మరింత పెరిగాయి. అయితే వాటిని పరిష్కరించకుంటూనే శ్రీను రెండవ సినిమా చేసేందుకు సురేష్ సిద్ధం అవుతున్నాడు. బెల్లంకొండ శ్రీనివాస్ రెండవ సినిమాకు హీరోయిన్ సమస్య ఏర్పడింది. తొలి సినిమాలో ఐటం గర్ల్ గా స్టెప్పులు వేసిన తమన్నా తాజా ప్రాజెక్టులో హీరోయిన్ గా నటిస్తుందని డైరెక్టర్, ప్రొడ్యూసర్ ముందుగా ప్రకటించారు. అయితే మిల్కిబ్యూటి ఇప్పట్లో గాలిపీల్చుకునేందుకు కూడా ఖాళీలేనంత బిజీగా మారిపోయింది. ప్రస్తుతం బాహుబలిసినిమాలో నటిస్తుంది. అలాగే ఓ తమిళ సినిమాకు డేట్లు ఇచ్చేసింది. దీనికి తోడు బెల్లంకొండ ఈ సినిమాను ఆలస్యంగా ప్రారంభించే అవకాశం ఉంది. సినిమా ఆలస్యం అవుతుండటంతో కాల్షీట్లు అడ్జస్టు చేయలేకపోయింది. దీంతో ప్రాజెక్టు నుంచి తప్పుకుంటున్నట్లు వారికి చెప్పేసింది. తమన్నా వెళ్ళిపోవటంతో బెల్లంకొండ ఫ్యామిలీకి కొత్త హీరోయిన్ కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముందుగా బయటి నిర్మాతకు శ్రీను రెండవ సినిమా అవకాశం ఇచ్చినా.. ఆ తర్వాత తానే చేస్తానని ఒప్పుకున్నారు. కాని ఆర్ధిక ఇబ్బందుల వల్ల కాస్త ఆలస్యంగా ప్రాజెక్టు మొదలవుతుందని తెలుస్తుంది. శ్రీను రెండవ సినిమాకు బోయపాటి శ్రీను డైరెక్టర్ గా వ్యవరిస్తున్నారు. మరి శ్రీనుకి సినిమాకు ఎవరు హీరోయిన్ గా ఎంపిక అవుతారో త్వరలోనే తెలియనుంది.

Post a Comment

 
Top