చిక్కులో తమన్నా సినిమా కెరీర్ ??
సినిమా రంగంలో ఎప్పుడు ఎవరి జీవితం ఎలా మలుపు
తిరుగుతుందో చెప్పలేము. ఇప్పుడు తమన్నాకు ఇదే పరిస్థితి గందరగోళంగా మారింది.
టాలీవుడ్ టాప్
హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన ఈ అమ్ముడు ఇప్పుడు అవకాశాలు రావడం లేదు. వచ్చిన
అవకాశానికి సంతకం చేసే లోపు మరో హీరోయిన్ కి వెళ్ళిపోతుంది ఆ అవకాశం. దనతో
పరిశ్రమలో ఇక తమన్నా సినిమాలకి గుడ్ బై చెప్పనున్నది అంటూ ఊహాగానాలు
వినిపిస్తున్నాయి.అగ్ర హీరోలందరి సరసన నటించిన తమన్నాకి మంచి ఫాలోయింగ్ ఉన్నది.
అయితే కొన్నిరోజులుగా
ఈమె టైం బాగోలేదు. ఈమె ఏది చేసిన ఫలితం నెగిటివ్ గానే వస్తుంది.
ఈమధ్య వచ్చిన సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. తాజాగా బహుబలిలో నటిస్తున్న
ఈమె మధ్యలో షూటింగ్ కి సెలవులు తీసుకుంది. ఆ తర్వాత వచ్చి జాయిన్ అయ్యి
కొన్ని సన్నివేశాలు చేసింది. నాగార్జున , కార్తి సినిమాలో హీరోయిన్ గా
చేస్తుందని ప్రకటించారు.ఇప్పుడు ఆ అవకాశం శృతి హసన్ కు వెళ్ళింది. తమిళంలో ఆర్య
పిలిచి తన సినిమాలో అవకాశం ఇవ్వడంతో సంతోషంగా అక్కడి సినిమాలో నటిస్తున్నది.
తాజా సమాచారం ప్రకారం ఆ ఒక్క సినిమా తప్ప తెలుగు , తమిళం, హిందీ పరిశ్రమల్లో మరో అవకాశం లేదు. దాంతో తమన్నా
కెరీర్ గందరగోళంలో పడింది అని చేప్పొచ్చు . కాలం ఎప్పుడు ఒకరివైపే
ఉంటుదని అనుకోవద్దు. కాబటి ఇవన్ని మాములే అనుకోవాలి.
Post a Comment