రజినీకాంత్ కి అంత సీన్ లేదంటా !!
ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ కు ఇండియాలో ఉన్న
ఫాలోయింగ్ ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇయనకి కొట్లలో అభిమానులు
ఉన్న విషయం తెలిసిందే. తమిళనాడులో ఇతన్ని దేవుడితో సమానంగా చూసుకుంటారు. ఈయన సినిమా వస్తున్న
రోజుని సెలవు దినంగా
స్వయంగా అభిమానులే ప్రకటించుకొని , ఓ పండుగలా జరుపుకుంటారు. ఈ ఫాలోయింగ్
దృష్ట్యా కొన్ని రాజకీయ పార్టీలు ఇతన్ని తమ పార్టీల్లోకి రప్పించే ప్రయత్నాలు
చేస్తున్నారు.
అయితే రజనీకాంత్
మాత్రం రాజకీయాల్లోకి రానని క్లారిటీ ఇచ్చినా….రాజకీయ పార్టీలు మాత్రం తమ
ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో రజనీకాంత్
పార్టీ పెట్టి ఎలక్షన్స్ లో పోటీ చేసినా పెద్దగా ప్రయోజనం ఉండదని , ఆయనకు సిఎం
అయ్యే హోదా లభించదని ఓ సర్వే వెల్లడించింది. తమిళనాడులో నియోజకవర్గాల
వ్యాప్తంగా తాము చేశామని ఆ సర్వే అంటున్నది. జయమ్మ అక్రమాస్తుల
కేసులో దోషిగా తేలడంతో ,
డీఎంకే పార్టీపై అవినీతి ఆరోపణలు చుట్టుకోవడం వంటి కారణంల వలన అన్నాడీఎంకే రాజకీయ
కెరీర్ ముగిసిపోయింది. దాంతో రజనీకాంత్ పొలిటికల్ కెరీర్ ని అనుకూల పరిస్థితి
ఏర్పడిందని చెబుతున్న కారణాలను ఆ సంస్థ కొట్టి పడేసింది. అమ్మకు శిక్ష పడటం 14% శాతం మంది సమర్దిస్తున్నారని
60% శాతం
మంది అమెకిఅనుకులంగా ఉన్నారని సర్వేలో తేలిందట. అదే రజనీకాంత్
పార్టీ పెడితే అందుకు కేవలం 17% మంది మాత్రమే మద్దతు తెలిపే అవకాశం
ఉన్నాడని సర్వేలో తేలిందట. దీన్ని బట్టి చుస్తే రజనీకాంత్ కి సినిమాలలో
ఉన్న ఫాలోయింగ్ రాజకీయాల్లో లేదని తేలిపోయింది.
Post a Comment