GuidePedia

0


పవన్ కళ్యాణ్ నెంబర్ ఇచ్చినందుకు సారి చెప్పాడు !!

టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు మరోసారి వార్తల్లో నిలిచాడు. ఆయన చేసిన తప్పుకి సారీ చెప్పారు. విషయం ఏమిటంటే... కొందరు మెగా అభిమానులకు రాజుగారు పవన్ కళ్యాణ్ నెంబర్ వన్ ఇచ్చారు. దాంతో ఓ అజ్ఞాత వ్యక్తికి బోలెడన్ని తిప్పలు వచ్చాయి. అందుకే ఇప్పుడు సారీ చెబుతున్నారు దిల్ రాజు. మొన్న వైజాగ్ లో జరిగిన పిల్లానువ్వులేని జీవితం సినిమా సక్సెస్ మీట్ లో రాజు గారు ఓ ఘనకార్యం చేశారు. కొందరు అభిమానులు ఆయన్ను పవన్ కళ్యాణ్ నెంబర్ కావాలంటూ పట్టు పట్టడంతో ఇక వదిలించుకోవలేని పరిస్థితుల్లో అయన వారికి నెంబర్ ఇచ్చేశాడు. నిజానికి అది రాజుగారి పాత ఫోన్ నెంబర్. కాకపోతే వాడకంలో లేని నెంబర్ కాబట్టి అది సరిగ్గా గుర్తులేక పొరపాటున ఓ నెంబర్ తప్పు చెప్పారట. ఇంకేముంది అభిమానులు ఆ తప్పు నెంబరునే పవన్ నెంబర్ అనుకోని ఇక కాల్స్ మీద కాల్స్ చేయడం మొదలుపెట్టారు.అవతల ఈ విషయం తెలియని ఓ అజ్ఞాత వ్యక్తి , టాలీవుడ్ తో ఏమాత్రం సంబంధం లేని వ్యక్తి , అసలు తనకు ఇన్నేసి కాల్స్ వస్తున్నాయేంటి అంటూ లబోదిబో అంటున్నాడు. ఆలస్యంగా ఈ విషయాన్నీ గ్రహించిన దిల్ రాజు , తన తప్పుకి మన్నించాలని కోరుతూ అభిమానులని ఆ అజ్ఞాత వ్యక్తిని ఇబ్బంది పెట్టొద్దు అని కోరడం జరిగింది.



Post a Comment

 
Top