GuidePedia

0

మాటీవీ ఇప్పుడు స్టార్ మా !!

తెలుగు వినోద రంగంలో కీలక ఒప్పందం కుదిరింది. మా టీవీ గ్రూప్‌ కంపెనీని స్టార్‌ ఇండియా కొనుగోలు చేసింది. తద్వారా స్టార్‌ గ్రూప్‌ తెలుగు వినోద రంగంలోకి ప్రవేశించింది. బుధవారం మాటీవీ డైరెక్టర్లు చిరంజీవి, నాగార్జున, అల్లు అరవింద్‌తో సంస్థ డైరెక్టర్‌ నిమ్మగడ్డ ప్రసాద్‌ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాటీవీ గ్రూప్‌ను స్టార్‌ ఇండియాకు విక్రయించినట్లు నిమ్మగడ్డ ప్రసాద్‌ ప్రకటించారు. వాటాల విలువ ఇప్పుడే చెప్పలేమన్నారు. మాటీవీని ఆదరించిన ప్రేక్షకులకు ప్రసాద్‌ ధన్యవాదాలు తెలిపారు. మాటీవీ అభివృద్ధికి సహకరించిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. తెలుగు ప్రేక్షకులకు నాణ్యమైన ప్రసారాలు అందిస్తామన్నారు. తెలుగు వినోద రంగంలో 27 శాతం వాటా ఉన్న మా గ్రూప్‌ ప్రస్తుతం నంబర్‌ వన్‌ స్థానంలో ఉందని తెలిపారు. సోనీ గ్రూప్‌తో ఎలాంటి ఒప్పందాలు లేవని నిమ్మగడ్డ స్పష్టం చేశారు. ఈ ఒప్పందం విలువ సుమారు రూ.1800 కోట్ల నుంచి రూ.2000 కోట్ల దాకా ఉంటుందని తెలుస్తోంది. తెలుగు వినోదరంగంలోకి రావాలన్న తమ నిర్ణయానికి మా సరైన ఎంపిక అని స్టార్‌ఇండియా ప్రతినిధి ఉదయ్‌భాస్కర్‌ అన్నారు. ఈ ఒప్పందాన్ని సూపర్‌ అలియన్స్‌గా ఆయన అభివర్ణించారు. లావాదేవీలు, కార్యక్రమాల్లో మార్పు, లోగో మార్పు వంటి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని అన్నారు. మా టీవీలో తాను చేస్తున్న మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని నటుడు నాగార్జున తెలిపారు.

Post a Comment

 
Top