GuidePedia

0

హైదరబాద్ బ్రాండ్ అంబాసిడర్ గా మహేష్ బాబు ?

హైదరాబాద్ ని విశ్వనగారంగా తీర్చిదిద్దుతామని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ తన దూకుడుని కొనసాగిస్తున్నారు. డల్లాస్ నగరం కంటే ఘనంగా భాగ్యనగరాన్ని మార్చుతానని అయన అన్నారు. అయన తాజాగా హైదరాబాద్ బ్రాండ్ అంబాసిడర్ గా హీరో మహేష్ బాబుని నియమించేందుకు పావులు కదుపుతున్నట్లు సమాచారం. ఉమ్మడి రాష్ట్రం కన్నా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత హైదరాబాద్ అభివృద్ధి కుంటుపడింది అనే విమర్శల నేపధ్యంలో హైదరాబాద్ బ్రాండ్ వ్యాల్యూ పెంచే అంశంపై కెసిఆర్ దృష్టి పెట్టారు. హైదరాబాద్ ప్రపంచంలోనే బెస్ట్ సిటీగా రూపొందించేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు.ఇప్పటికే హుస్సేన్ సాగర్ ప్రక్షాళన , సాగర్ చుట్టూ ఆకాశ హర్మ్యాలు నిర్మాణం తదితర అంశాలపై కసరత్తు చేస్తున్న యన హైదరాబాద్ ఓ బ్రాండ్ అంబాసిడర్ ఉండాలని యోచిస్తున్నారు. ఇప్పటికే టెన్నిస్ స్టార్ సానియా మిర్జాని తెలంగాణా బ్రాండ్ అంబాసిడర్ గా ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే.ఇక అన్ని వర్గాల్లో క్రేజ్ ఉన్న హీరో మహేష్ బాబు హైదరాబాద్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటె బాగుంటుంది అని కెసిఆర్ ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్లు , ఇదే విషయాన్నీ అయన కొంతమంది సన్నిహితులతో చర్చించినట్లు సమాచారం. ఇందుకు సంబంధించి మహేష్ బాబుతో కూడా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. మహేష్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇస్తే. ముందుకు సాగాలని ప్రభుత్వం భావిస్తుంది.

Post a Comment

 
Top