పెళ్లి కి సిద్దం అంటున్న నయనతార
నయనతార ఈ పేరు పై ఉన్న గాసిప్స్ ఇంకేవరిపై ఉండవేమో అన్నట్లు పుట్టుకొస్తాయి ఎక్కడ లేని వార్తలు. ఇటీవలకాలంలో తన పాత లవర్ శింబుకు ఆమె దగ్గర కావడానికి తనవంతు ప్రయత్నాలు చేస్తోందని ప్రచారం సాగింది. అంతేకాదు ఈ హీరో గారి బర్త్‌డేకు హైదరాబాద్ నుంచి చెన్నైకి హడావుడిగా చెక్కేసిందని రూమర్లు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో శింబుని నయన్ మ్యారేజ్ చేసుకోవడం ఖాయమంటూ రూమర్ల పుట్టుకొచ్చాయి. హ్యాపీగా పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అవ్వాలని భావించిన నయనతార, పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకోవడానికి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఈ విషయం గురించి ఆమె ఇంట్లో చర్చించారట. సినిమా ఇండస్ర్టీతో సంబంధంలేని వ్యక్తిని చూడమని పేరెంట్స్‌కు చెప్పిందని కోలీవుడ్ టాక్. మొత్తానికి నయన్ ఈ ఏడాది చివర్లో కానీ లేదా వచ్చే ఏడాది పెళ్లి చేసుకోవడం ఖాయమన్నమాట.
Post a Comment