GuidePedia

0

టెంపర్ సెన్సార్ రిపోర్ట్ -  U/A వచ్చింది...

జూనీయర్ ఎన్టీఆర్ నటించిన టెంపర్' సెన్సార్ పూర్తయింది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు యు/ఎ' సర్టిఫికెట్ జారీ చేసారు. టెంపర్' సినిమా రన్ టైం సుమారు 141 నిమిషాలు ఉంటుంది. అందులో ఫస్ట్ హాఫ్ 1 గంట 8 నిమిషాలు, సెకండాఫ్ 1 గంట 13 నిమిషాలు ఉండబోతోందని తెలుస్తోంది. టెంపర్' మూవీ ఈ నెల 13న గ్రాండ్‌గా విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ కెరీర్లో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ చిత్రం భారీగా సంఖ్యలో థియేటర్లలలో విడుదలవుతోంది. ఓవర్సీస్ మార్కెట్లో దాదాపు 250 స్క్రీన్లలో ఈ చిత్రం విడుదల చేస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రెస్టాఫ్ ఇండియాతో కలిసి దాదాపు 1000 స్క్రీన్లలో ప్రదర్శిస్తున్నారు. ఈసినిమాతో ఎన్టీఆర్ త‌న రేంజ్ చూపించ‌డం ఖాయ‌మ‌ని అభిమానులు న‌మ్ముతున్నారు. ఈనెల 13న టెంప‌ర్ ప్రేక్షకుల ముందుకు వ‌స్తోంది. అనూప్ సంగీతం అందించాడు. ఎన్టీఆర్, కాజల్, ప్రకాష్‌రాజ్‌, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, అలీ, పోసాని కృష్ణమురళి, సుబ్బరాజు, మధురిమ బెనర్జి, వెన్నెల కిషోర్‌, జయప్రకాష్‌రెడ్డి, సప్తగిరి, కోవై సరళ, రమాప్రభ, పవిత్ర లోకేష్‌ తదితరులు ఇతర పాత్రధారులు. 

Post a Comment

 
Top