GuidePedia


సౌత్ ఇండియా హాట్ హీరోయిన్ హన్సికకు గోవా అచ్చొచ్చినట్టు లేదు. గతంలో కూడా ఆమెపై కొంతమంది ఆకతాయి కుర్రాళ్లు ఫ్యాన్స్ అంటూ అసభ్యంగా ప్రవర్తించిన సంగతి తెలిసిందే. చిన్నప్పటినుంచి హన్సిక నటిగానే తన కెరీర్‌ను మొదలుపెట్టడంతో ఆమెకు సౌత్‌లో ఎక్కడికెళ్లినా మంచి ఫాలోయింగ్ వుంటుంది. దీంతో ఈ అమ్మడికి ఎక్కడబడితే అక్కడ చాలామంది ఫ్యాన్స్ వుంటుంటారు.అయితే...హీరో సిద్ధార్థ్‌, హన్సికలతో కలిసి తెలుగు, తమిళంలో ఒకేసారి తెరకెక్కిస్తున్న చిత్రానికి సంబంధించి షూటింగ్‌ను గోవాలో పెట్టుకున్నారు యూనిట్ సభ్యులు. షూటింగ్ జరుగుతున్న సమయంలో అక్కడకు కొంతమంది వచ్చారు. తామంతా మీ అభిమానులమని, ఆటోగ్రాఫ్ ఇవ్వాలంటూ హన్సికను చుట్టుముట్టారు. అంతేకాకుండా ఆమెకు మరింత దగ్గరగా జరిగిన ఆకతాయిలు ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. ఆమె ఒళ్లంతా తడిమేశారు. దీంతో హన్సిక ఒక్కసారిగా షాక్‌కు గురైంది. వెంటనే తేరుకుని వారిని తోసేసింది. ఈ విషయాన్ని గమనించిన యూనిట్ సభ్యులు ఆకతాయిలను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ కొంతసేపు  ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం వారక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ సంఘటనతో హన్సిక, యూనిట్ సభ్యులు తీవ్ర అప్‌సెట్‌కు గురయ్యారు. ఆ రోజు షూటింగుకు ప్యాకప్ చేప్పేశారు.

 
Top