తెలుగు చిత్ర పరిశ్రమలో వినిపిస్తున్న తాజా సమాచారం ప్రకారం మహేష్ తో వన్
సినిమాలో నటించిన క్రితిసనన్ ఇప్పుడు టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో టాక్ అఫ్ ద
టౌన్ గా మారింది. ముఖ్యంగా క్రితిసనన్ ఓ మెగా హీరోతో డేటింగ్ చేస్తుందనే
టాక్ పరిశ్రమలో బలంగా వినిపిస్తుంది . అదృష్టం అనేది ఎప్పుడు ఎలా వస్తుందో
ఎవరికీ తెలియదు. అది అనుకోకుండా వస్తూ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అమితమైన
ఆనందాన్ని తెస్తుంది. ఇప్పుడు వన్ సినిమా హీరోయిన్ కు అటువంటి అదృష్టమే
వచ్చింది. ఒకేసారి రెండు సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది. అంతేకాదు. ఆ
ఇద్దరు హీరోలు కూడా మెగా క్యాంపుకు చెందిన స్టార్స్ కావడం విశేషం. అయితే
క్రితిసనన్ ఈ ఇద్దరు మెగా హీరోలలో ఒకరితో గత రెండు నెలలుగా టచ్ లో ఉన్నదంటూ
టాక్ వినిపిస్తుంది. అందుకే మెగా హీరోల సినిమాలో కృతి సనం నటించడానికి
అవకాశం వచ్చిందని టాలీవుడ్ సమాచారం. ఏదేమైనా మొదటి సినిమాతో కృతి మహేష్ తో
నటించే అవకాశం రావడంతో ఇక ఈ అమ్మడుకి అవకాశాలు వరుసగా వస్తాయని
అనుకున్నారు. కానీ అలా జరగలేదు. ఈ సినిమా ఫ్లాప్ అవడంతో టాలీవుడ్లో
అవకాశాలు కూడా రాలేదు. అందం అభినయం తో పాటు నటనతో కూడా ఆకట్టుకున్నా
కృతిని పట్టించుకున్న వారే లేదు. దాంతో ఇక ఈ ముద్దుగుమ్మ కెరీర్
ముగిసినట్లే అనే టాక్ వినిపించింది. కానీ ఒకసారి అల్లు అర్జున్ రామ్ చరణ్
సినిమాల్లో నటించే అవకాశం దక్కించుకుంది.