GuidePedia

0


చేకోడి రేటింగ్  :   2.75/5
బ్యానర్: వారాహి చలనచిత్రం
మాటలు: రమేష్‌ - గోపి
కూర్పు: తమ్మిరాజు
ఛాయాగ్రహణం: బి.వి.అమరనాథ్‌రెడ్డి
సంగీతం: కీరవాణి
నిర్మాత: రజనీకొర్రపాటి
సమర్పణ : సాయి కొర్రపాటి
కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం: త్రికోటి
నటీనటులు: అజయ్‌, శౌర్య, ఇంద్రజ, సనాఖాన్‌, నాగినీడు, అలీ, విశాల్‌, రమేష్‌, హరితేజ, వేణు తదితరులు

యువనటుడు నాగశౌర్య, సనా మక్బూల్ హీరో, హీరోయిన్లుగా నటించిన దిక్కులు చూడకు రామయ్యమూవీ శుక్రవారం రిలీజైంది. సీనియర్ దర్శకుడు రాజమౌళి వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన త్రికోటి ఈ చిత్రానికి దర్శకత్వం వహించి ఈ రంగంలో తొలి అడుగు వేశారు. తండ్రి, కొడుకు ఒకే అమ్మాయిని ప్రేమించే కాన్సెఫ్ట్ తో ఈ చిత్రం తెరకెక్కింది. ఇలాంటి కాన్సెఫ్ట్ అనగానే ముందు సినిమా వల్గర్ గా ఉంటుందనే అంచనాకు వచ్చే అవకాశం ఉంది. కానీ ఉత్తామభిరుచిగల నిర్మాతగా పేరు తెచ్చుకున్న సాయి కొర్రపాటి బ్యానర్ నుంచి వచ్చే సినిమా, పైగా కథను నమ్మి సినిమాని తెరకెక్కించే నిర్మాత కాబట్టి, డైరెక్టర్ మంచి కథతో వచ్చి ఉంటేనే ఈ చిత్రాన్ని నిర్మించి ఉంటారనే అంచనాలు ఈ సినిమాపై ఉన్నాయి. ఇక ఈ సినిమా ప్రచార చిత్రాలు కూడా సినిమాపై అంచనాలు పెంచాయి. మరి ఆ అంచనాలను అందుకునే విధంగా ఈ సినిమా ఉందా? వారాహి బ్యానర్ ప్రతిష్టను మరింత పెంచే విధంగా ఉందా అనే విషయాన్ని తెలుసుకుందాం.

కథ :  స్టేట్ బ్యాంక్ లో పని చేసే గోపాలకృష్ణ(అజయ్) తప్పనిసరి పరిస్ధితుల్లో వివాహం చేసుకోవాల్సి వస్తుంది. దాంతో ప్రేమించి పెళ్లి చేసుకోవాలి అనే అతని కల నెరవేకుండా మిగిలిపోతుంది. అయితే ఆ కోరిక వాస్తవ రూపం దాల్చే సమయం...సంహిత(సన మక్బూల్)పరిచయంతో జరుగుతుంది. తన కన్నా సగం వయస్సు ఉన్న ఆమెతో తాను అవివాహితుడునని చెప్పి ప్రేమించటం మొదలెడతాడు. అయితే ట్విస్ట్ ఏమిటంటే.. గోపాల్ కృష్ణ పెద్ద కొడుకు మధు(నాగ శౌర్య) కూడా ఆమెతోనే ప్రేమలో పడతాడు. ఒకరి విషయం మరొకరికి తెలియక ..ఇద్దరూ ఆమె చుట్టూ ప్రేమిస్తూనంటూ తిరుగుతారు. చివరకు గోపాల కృష్ణకు అసలు విషయం ఎప్పుడు తెలిసింది. చివరకు ఏం జరిగిందనేది మిగతా కథ.

నటినటులు :  గోపాలకృష్ణ పాత్రకు అజయ్ వంద శాతం న్యాయం చేసాడు. ఓ మధ్యతరగతి తండ్రిలా, అమ్మాయిని ప్రేమించే మధ్య వయసువాడిగా అజయ్ అద్భుతంగా నటించాడు. ఇంద్రజ పాత్ర నిడివి తక్కువే అయినప్పటికీ, పిల్లలను, భర్తను ప్రాణంగా చూసుకునే తల్లి పాత్రను చక్కగా పోషించింది. 

మధు పాత్రను నాగశౌర్య చక్కగా చేసాడు. తల్లి, తండ్రిని ప్రేమించే కుర్రాడిగా చక్కటి ఎక్స్ ప్రెషన్ తో కొన్ని సీన్స్ లో ప్రేక్షకులను కట్టిపడేస్తాడు నాగశౌర్య. హిందీ టీవీ సీరియల్ నటి సనా మక్బూల్ తన పరిధిమేరకు నటించింది 

సంహిత వెంట పడే పక్కంటి వ్యక్తి టామీగా అలీ కొన్ని సీన్స్ లో నవ్వించాడు. అజయ్ ఫ్రెండ్ గా బ్రహ్మాజీ కూడా కొన్ని సీన్స్ లో నవ్వించాడు. మిగతా నటీనటులు తమ పాత్రల పరిధిమేరకు నటించారు.

సాంకేతిక వర్గం : ఇలాంటి పాయింట్-ని వినోద భరితంగా చెబుతూ, మనసును టచ్ చేసే కొన్ని పాయింట్స్-ని అక్కడక్కడ  మిస్ అయిన చక్కటి స్ర్కీన్ ప్లే ఇచ్చారు. డైలాగులు కూడా పరవాలేదు అనే స్తాయిలో ఉన్నాయి. తండ్రి, కొడుకు ఓ అమ్మాయిని ప్రేమించే పాయింట్ ని తీసుకోవడమే రిస్క్. ఈ పాయింట్ ని సరైన స్ర్కీన్ ప్లేతో చెప్పలేకపోతే సినిమాపై నెగటివ్ టాక్ స్ర్పెడ్ అవుతుంది.  ఎం ఎం కీరవాణి కథానుసారం, సందర్భానుసారం  పాటలు సమకూర్చారు. కీరవాణి అందించిన పాటల్లో..  తేలిపోతున్నా’, ‘అంటే ప్రేమంటేపాటలు బాగున్నాయి. ఎడిటింగ్ కూడా బాగుంది. నిర్మాణపు విలువలు బాగున్నాయి. కథకు అవసరమైన మేరకు ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా చిత్రాన్ని నిర్మించారు సాయి కొర్రపాటి.

ప్లస్ పాయింట్స్ :
·        కీరవాణి సంగీతం
·        కొంచం కామెడీ  

డ్రా బాక్స్ :
·        స్లో – స్కీన్ ప్లే
·        సెకండఫ్

చివరిగా :  ఇలాంటి చిన్న సినిమాలకు కథ,కథనమే ప్రాణం. ముఖ్యంగా పాత్రల మధ్య ఉండే కాంప్లిక్ట్ ఏ మేరకు డ్రామాకు దారి తీసింది, ఎంత వరకూ చూసేవారిని భావోద్వేగాలకు గురిచేసిందనేదానిపైనే ఈ కథలు సక్సెస్ అవుతూంటాయి. ఈ చిత్రం స్క్రిప్టు ఆ విషయంలోనే ఫెయిలైందనిపిస్తుంది. ఈ చిత్రం స్టోరీ లైన్ దశలోనే ఆగినట్లు, ట్రీట్ మెంట్ సరిగా జరగలేదు అనిపిస్తుంది. ఫస్టాఫ్ లో ఏవైతే సీన్స్ వస్తాయో..సెకండాఫ్ లోనూ అవే సీన్స్ మారి,మారి వస్తూంటాయి. తండ్రి,కొడుకులు ఇద్దరూ ఒకే అమ్మాయి వెనక పడుతున్నారు..పడుతున్నారు..పడుతున్నారు అంటూ అవే సీన్స్ రిపీట్ గా వస్తూంటాయి.
పోనీ ఇంటర్వెల్ కు అయినా ఒకరి విషయం మరొకరికి తెలుస్తుందేమో అనుకుంటే టీవి సీరియల్ తరహాలో ఓ ఫేక్ బ్యాంగ్ ఇచ్చి...మళ్లీ సెకండాఫ్ లోనూ అదే నడుపుతూంటారు. దాంతో ఎక్కడా కీ రోల్ అయిన అజయ్ ఎక్కడా సమస్యలో పడినట్లు కనపించదు. అతను సమస్యలో పడ్డాడు..అతను కొడుకుకి తెలిసిపోయింది..ఇంట్రస్ట్ పుట్టింది అనేసరికి సెకండాఫ్ సగం అయ్యిపోయింది. ఇక తన కొడుక్కి అసలు విషయం తెలిసింది అనే విషయం అజయ్ కు తెలిసేసరికి క్లైమాక్స్ వచ్చేసింది. దాంతో అసలు కథలో ఎక్కడా సరైన కాంప్లిక్ట్ ఎస్టాబ్లిష్ కాలేదు. దాంతో కథనం ఆసక్తికరంగా సాగలేదు.

Post a Comment

 
Top