GuidePedia

 తేజ దర్శకత్వంలో కమల్ హసన్ 



యువ హీరోలతో ప్రేమకథలని తెరకేక్కిస్తూ....విజయాలను అందుకే దర్శకుడిగా పేరున్నది తేజకి. ఉదయ్ కిరణ్ నితిన్ ప్రిన్స్ వంటి హీరోలని తెరకి పరిచయం చేసింది తెజనే. ఎప్పటికప్పుడు నవతరం హీరోలని తెరకి పరిచయం చేస్తూ మాత్రమే సినిమాలు చేస్తానని చెప్పిన తేజ....ఇటీవల కాలంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. తన మార్క్ సినిమాలని తెరకెక్కించడంలో ఫెయిల్ అవుతున్నాడు. పైగా చాలామంది బెట్టు వీడి పెద్ద హీరోల సినిమాలు చేయొచ్చు కదా! అంటే ఒప్పుకోవడం లేదు. అయితే వీటన్నిటినీ కొట్టే వార్త ఒకటి టాలీవుడ్ పరిశ్రమలో హాల్ చల్ చేస్తుంది. త్వరలో విశ్వనటుడు కమల్ హసన్ ని తేజ డైరెక్ట్ చేయబోతున్నాడనేది ఆ వార్త. ఇప్పటికే పద్మశ్రీ కమల్ హసన్ ని తేజ పలు దఫాలుగా కలిశాడు. స్క్రిప్ట్ విషయమై చర్చించాడు. ఈ వారంలో బెంగుళూరు వెళ్లి మరోసారి కలవనున్నాడు. స్క్రిప్ట్ ఫైనల్ అయిపోతే తెలుగు వర్షన్ తేజ దర్శకత్వం వహిస్తారు. తమిళ్ వర్షన్ ని మాత్రం కమల్ హసనే స్వయంగా దర్శకత్వం వహిస్తారని అనుకుంటున్నారు. ప్రస్తుతం కమల్ హసన్ విశ్వరూపం 2 సినిమా విడుదల పనిలో ఉన్నాడు. అలాగే ఉత్తమ విలన్ తోనూ పూర్తి బిజీగా ఉన్నాడు. కాబట్టి ఆ కమిట్ మెంట్ పూర్తవ్వగానే తేజ చాన్స్ ఉంటుందేమో చూడాలి.
 
Top