తెలుగు నిర్మాతల వద్ద చకర్లు కొడుతున్న ఇలియానా వీడియో
ఒకప్పుడు గోవా నుంచి తెలుగు సినిమాకి వచ్చి ఇక్కడ పాతుకుపోయిన హీరోయిన్
ఇలియానా. వుందా లేదా అన్నట్లుండే నడుంతో తెలుగువారిని కొంతకాలంపాటు
కనువిందు చేసింది. హిట్స్‌తో సంబంధం లేకుండా అమ్మడు పారితోషికం పెంచేయడంతో
ఇక ఆమెతో సినిమాలు చేయలేమని నిర్మాతలు చేతులెత్తేశారు. ఆ తర్వాత 'బర్ఫీ'తో
హిందీలో వచ్చిన ఆఫర్ ఆమెని అక్కడే స్టార్‌ని చేసింది. ఇక తెలుగు సినిమాలకి
గుడ్‌బై చెప్పినట్లే అనుకునే టైమ్‌లో ఇటీవలే ఓ మేగజైన్ కోసం ఇలియానా ఇచ్చిన
ఫోజులు మళ్లీ నిర్మాతల్లో ఆశల్ని రేకెత్తిస్తున్నాయి. బికినీలో దర్శనమిచ్చిన ఇలియానా అందరి మతులు పోగొట్టింది. అంతేకాదు..
ఒకప్పుడు నిన్ను పోషించలేం పోవమ్మా అని చెప్పిన తెలుగు నిర్మాతలే ఇప్పుడామె
బికినీ ఫోటోషూట్ మేకింగ్ వీడియో తెప్పించుకుని మరీ చూస్తున్నారట. అలా
నిర్మాతల కార్యాలయాల్లోకి సర్క్యూలేట్ అవుతున్న ఇలియానా వీడియో ఆమె
డిమాండ్‌ని చెప్పకనే చెబుతోంది. కాకపోతే ఎటొచ్చీ మళ్లీ పారితోషికం వద్దే
ఆలోచించాల్సి వస్తోందట. బాలీవుడ్‌కి వెళ్లకముందే అంతకావాలి.. ఇంతకావాలి అని
కండిషన్స్ పెట్టిన ఇలియానా ఇప్పుడు బాలీవుడ్ హీరోయిన్ అయి కూర్చుంది.
అలాంటిది ఇప్పుడు ఇంకెంత డిమాండ్ చేస్తుందోనని ఆమెని టచ్ చేయడానికి
వెనకడుగేస్తున్నారట