మళ్లి రానున్న గబ్బర్ సింగ్ జోడి ??
గబ్బర్‌సింగ్ కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతుందా..? పవన్‌కల్యాణ్
- హరీష్ శంకర్
న్యూ మూవీకి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ పనిలో దర్శకుడు హరీష్ శంకర్
బిజీగావున్నట్లు సమాచారం. పవన్‌కల్యాణ్ - హరీష్ శంకర్ కాంబినేషన్‌లో
వచ్చిన 'గబ్బర్‌సింగ్' సాధించిన
విజయం అంతాఇంతా కాదు. అది పవన్ ఇమేజ్‌నే కాదు డైరెక్టర్ హరీష్‌కి ఓ స్టయిల్‌ని
క్రియేట్ చేసింది. ఇప్పుడు వీళ్ల కలయికలోనూ మరో సినిమాకి ప్లాన్ జరుగుతోంది. ఇటీవల
పవన్‌ను కలిసిన
హరీష్ హరీష్ శంకర్...మంచి
సబ్జెక్ట్ వుంటే రెడీ చేయమని చెప్పినట్లు ఫిల్మ్‌నగర్ సమాచారం.
ఇప్పుడు ఆ పనిలోనే దర్శకుడు వున్నట్లు తెలుస్తోంది. తన స్టోరీతో పవన్‌ని ఈ
డైరెక్టర్ కన్విన్స్ చేయగలిగితే వీళ్ల కాంబినేషన్ వచ్చే ఏడాదిలో మొదట్లోనే
సెట్స్‌పైకి వెళ్లడం ఖాయమంటున్నారు. గబ్బర్‌సింగ్ తర్వాత హరీష్‌కు
రామయ్యా వస్తావయ్యా భారీ డిజాస్టర్ ఎదురైంది. పవన్ ప్రాజెక్టుతో మళ్లీ సెట్స్
పైకి వెళ్తే ఈ దర్శకుడు పుంజుకోవడం ఖాయమని అనుకుంటున్నారు.
Post a Comment