GuidePedia

0




చేకోడి రేటింగ్ : ★★½ - 2.5
బ్యానర్: షిరిడి సాయి కంబైన్స్
నటీనటులు: హర్షవర్ధన్ రాణే, అవంతిక, సుష్మా రాజ్, నాగబాబు, ఝాన్సీ తదితరులు
సంగీతం: శేఖర్ చంద్ర
ఎడిటర్: నవీన్ నూలి
ఛాయాగ్రహణం: బాల్ రెడ్డి
నిర్మాతలు: మధుర శ్రీధర్ -  ఎమ్‌.వి.కె.రెడ్డి
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: నీలకంఠ
విడుదల తేది: 01,ఆగస్టు, 2014.

షో చిత్రంతో నేషనల్ అవార్డ్ అందుకున్న నీలకంఠ ఈ మధ్య చేస్తున్నసినిమాలతో కమర్షియల్ గా హిట్స్ అందుకోలేకపోతున్నాడు. అందుకే ఆయన ఈ సారి ఎక్స్ట్రా సెన్సరీ పర్సెప్షన్ కాన్సెప్ట్ తో ఆడియన్స్ ని థ్రిల్ ఫీల్ చెయ్యడానికి చేసిన సినిమా మాయ’. డైరెక్టర్ మధుర శ్రీధర్ ఎంవికె రెడ్డి కలిసి నిర్మించిన ఈ సినిమాలో హర్షవర్ధన్ రాణే, అవంతిక, సుష్మ రాజ్, నందిని రాయ్ కీలక పాత్రలు పోషించారు. సస్పెన్స్, థ్రిలర్ రూపొందిన ఈ చిత్రం మాయ చేసిందా అని తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే. 

కథ : ఓ టెలివిజన్ రిపోర్టర్ గా పనిచేసే మేఘన (అవంతిక మిశ్రా) చిన్నతనం నుంచి జరగబోయే సంఘటనలు ముందే తెలిసే ఈఎస్పీ (ఎక్స్ ట్రా సెన్సరీ పర్ సెప్షన్) అనే వ్యాధితో బాధపడుతుంటుంది. వృత్తిలో భాగంగా ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ సిద్దార్థ్ వర్మ (హర్షవర్ధన్ రాణే)తో కలిసి పనిచేయాల్సి వస్తుంది. ఈ క్రమంలో సిద్ధూ, మేఘన ఒకర్నిమరొకరు ప్రేమించుకుంటారు. అయితే తన చిన్ననాటి స్నేహితురాలు పూజా(సుష్మా రాజ్)కు సిద్దూకి పెళ్లి కుదిరిందనే నిజం తెలుస్తుంది. అంతేకాకుండా సిద్దూ ఫస్ట్ లవర్ వైశాలి (నందిని రాయ్) రోడ్డు ప్రమాదంలో అనుమానస్పద  స్థితిలో మృతి చెందుతుంది. వైశాలి మృతి విషయంలో సిద్దూపై అనేక అనుమానాలు తలెత్తుతాయి. ఇలా ఉండగా పూజాను సిద్దూ చంపబోతున్నట్టు మేఘనకు ముందే తెలుస్తుంది. పూజాను సిద్దూ నిజంగానే చంపుతాడా? పూజాను సిద్దూ ఎందుకు చంపాల్సి వస్తుంది? తన స్నేహితురాలు పూజాను మేఘన రక్షించుకుంటుందా? వైశాలి మృతి వెనుక కారణాలేంటి? వైశాలి మృతి విషయంలో సిద్దూపై ఎందుకు అనుమానాలు తెలుత్తాయి అనే ప్రశ్నలకు సమాధానమే 'మాయ'. 
నటినటులు :  హర్షవర్ధన్ రాణే ఈ నటుడు మొదటి నుండి విభిన్నమయిన చిత్రాలు చేస్తున్నారు. ఈ చిత్రం కూడా విభిన్నం అయినదే అయన నటన కూడా అదే స్థాయిలో ఆకట్టుకున్నారు. మరీ చిత్రాన్ని భుజాల మీద మోసేసే పాత్ర కాకపోవడంతో అతని నటన పరిధి మేరకు ఆకట్టుకున్నారు. మేఘన పాత్రలో అవంతిక మిశ్రాకు ఈ చిత్రంలో కీలకపాత్ర లభించింది. గ్లామరస్ గా కనిపించింది. కొంత నటనకు స్కోప్ ఉన్న పాత్రను పర్వాలేదనిపించే స్థాయిలో పోషించింది. మిగిలిన హీరోయిన్ సుష్మ రాజ్ నెగటివ్ షేడ్స్ మాత్రం బాగా చేసింది. ముఖ్యంగా క్లైమాక్స్ లో ఆకట్టుకుంది. సిద్దూకి ప్రియురాళిగా నటించిన నందిని రాయ్ ది అంతగా ప్రాధాన్యత లేని పాత్రే. నాగబాబు, ఝాన్సీ, వేణులు అతిధి పాత్రలకే పరిమితమయ్యారు
ప్లస్ పాయింట్స్:
·        చివరి 20 నిముషాలు
·        స్క్రీన్ ప్లే
·        కొత్త కథ, కథనం ఉత్కంఠతో నడిపే కథనం
మైనస్ పాయింట్స్:
·        సస్పెన్స్, థ్రిల్లర్ చిత్రాల్లో ఉండే వేగం లేకపోవడం 
·        వినోదం
సాంకేతిక వర్గం పనితీరు: 
ఎప్పుడూ విభిన్న కథాంశంతో చిత్రాలను తెరకెక్కించే దర్శకుడు నీలకంఠ తాజాగా మరో ప్రయోగం మాయతో ముందుకొచ్చారు. తొలి సీన్ లోనే థ్రిల్ కలిగించి నీలకంఠ ఆకట్టుకున్నారు.  ఆతర్వాత కథ నత్తనడక సాగడంతో తొలి భాగం కొంత విసుగు పుట్టించే విధంగా ఉంటుంది. ఇక రెండవ భాగంలో హీరోపై అనుమానాలు రేకెత్తించి కొంత ఆసక్తిని రేపాడు.  క్లైమాక్స్ లో ఊహించని విధంగా కథను కీలక మలుపు తిప్పి నీలకంఠ తన మార్కును చూపించారు. దర్శకుడుగా నీలకంఠ ..అప్ టు ద మార్క్ చేయలేదనిపిస్తుంది. ఓ హారర్, థ్రిల్లర్ చిత్రాలకు అవసరమయ్యే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ను అందించి శేఖర్ చంద్ర ఆకట్టుకున్నారు. పాటలు అంతగా గుర్తుంచుకునేలా లేకపోవడం ఈ చిత్రానికి మైనస్ అని చెప్పవచ్చు. బాల్ రెడ్డి ఫోటోగ్రఫి క్వాలిటీ పరంగా బాగుంది. డైలాగ్స్ జస్ట్ ఓకే అనేలా ఉంటాయి. మధుర శ్రీధర్ ఎంవికె రెడ్డి నిర్మాణ విలువలు బాగున్నాయి. 


ఎక్స్ట్రా సెన్సరీ పర్సెప్షన్ తో తెలుగు ప్రేక్సహ్కులను ఆకట్టుకోవాలని నీలకంఠ చేసిన మాయసినిమా ఆడియన్స్ ని పూర్తిగా తన మాయలో పడేసుకోలేకపోయింది. గతంలో ఈ దర్శకుడు చేసిన చిత్రాలతో పోలిస్తే ఈ చిత్రం చాలా నాసిరకమయిన ఫలితం అనే చెప్పాలి ఎందుకంటే అయన అనుకున్న విషయాన్నీ చెప్పడంలో ఇప్పటి వరకు విఫలం అవ్వలేదు కాని మొదటి సారి ఎలా చెప్పాలో తెలియక తడబడినట్టు తెలిసింది. ఇక కేసు ముసేసాక కూడా సుష్మ నేరస్తురాలని పోలీస్ లకి ఎలా తెలిసింది? మొదటి పది నిమిషాల పాటు చిత్రంలో ఏదో ఉంది అన్న ఊహ సృష్టించడంలో దర్శకుడు విజయం సాదించాడు కాని చిత్రం సాగుతున్న కొద్దీ సాగదిత అనుభవం కలుగుతుంది పైగా ఈ చిత్రం చూసే ప్రేక్షకుడు కూడా ఎక్స్ట్రా సెన్సరీ పర్సెప్షన్ అంటే ఏంటో ఫీల్ అవుతాడు ఎందుకంటే తరువాత జరిగే సన్నివేశం ఏంటో యిట్టె అతనికి తెలిసిపోతు ఉంటది కాబట్టి.. కానీ తీసినంత వరకూ మరీ చెడగొట్టకుండా డీసెంట్ గా డీల్ చేసినందుకు మెచ్చుకోవాలి. స్టార్టింగ్, క్లైమాక్స్, కొన్ని థ్రిల్లింగ్ మో మెంట్స్, హర్షవర్ధన్ రాణే పెర్ఫార్మన్స్ సినిమాకి హైలైట్ అయితే లాజికల్ గా మిస్టేక్స్ ఉండడం, బోరింగ్ నెరేషన్, కంటిన్యూగా ఆడియన్స్ లో ఆసక్తి కలిగించలేకపోవడం మేజర్ మైనస్ పాయింట్స్.
చేకోడి రేటింగ్ : ★★½ - 2.5
                                                                        

Post a Comment

 
Top