చేకోడి
రేటింగ్ : ★★★ – 3/5
బ్యానర్: యు.వి.
క్రియేషన్స్
నటీనటులు: శర్వానంద్, సీరత్‌కపూర్, అడివి శేష్, సంపత్,
జయప్రకాశ్‌రెడ్డి, వెన్నెల కిశోర్, అలీ, కోట
శ్రీనివాసరావు, విద్యుల్లేఖ
రామన్, అజయ్ ఘోష్ తదితరులు
సంగీతం: ఘిబ్రాన్ ఎం
ఎడిటర్: మధు
ఛాయాగ్రహణం: మధి
నిర్మాతలు:
వి.వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్
ఉప్పలపాటి
కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సుజిత్
విడుదల
తేది: 01,ఆగస్టు, 2014.
టాలెంట్ ఉన్నా కానీ అందుకు తగ్గ సక్సెస్
సాధించలేకపోతున్న శర్వానంద్. దాదాపు 40దాకా షార్ట్
ఫిల్మ్ లు తీసి యు ట్యూబ్ ప్రపంచంలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న సుజీత్
తెలుగు తెరకు దర్శకుడిగా పరిచయమవుతూ చేసిన సినిమా ‘రన్ రాజా రన్'. కిడ్నాప్ డ్రామాకు ప్రేమ కథను జోడించి ఓ యూత్ ఫుల్ చిత్రంగా ప్రేక్షకులకు అందించిన 'రన్ రాజా రన్' ప్రేక్షకుల అభిరుచికి తగినట్టు ఉందా అనే విషయం తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.
కథ
: రాజా
(శర్వానంద్) ఎంతో మందిని అమ్మాయిలను ప్రేమించినా అందరితో నిజం చెప్పడమే
కారణంగా బ్రేక్ అప్ అయిపోతూ ఉంటాడు. రాజా మరియు అతని తండ్రి (జయప్రకాశ్)
కలిసి మార్కెట్ లో కూరగయలు వ్యాపారం చేస్తూ ఉంటారు. కాగా తాజా బ్రేక్ అప్
తరువాత అతని జీవితంలోకి అనుకోకుండా ప్రవేశిస్తుంది ప్రియ(సీరత్ కపూర్), ఇదే సమయంలో
నగరంలో పెద్ద మనుషులను ఒక గ్రూప్ కిడ్నాప్ చేస్తూ ఉంటుంది. ఈ
గ్రూప్ ని పట్టుకోవడానికి పోలీస్ డిపార్టుమెంటు ప్రత్యేక అధికారిగా
దిలీప్ కుమార్(సంపత్) ని నియమిస్తుంది . అతనికి సబ్ ఆర్డినేట్ గా నయీం(అడివి
శేష్) పని చేస్తూ ఉంటాడు. వీళ్ళందరు కలిసి ఆ గ్రూప్ ని పట్టుకోవడానికి
ఒక పథకం వేస్తారు.
పోలీస్ లే ఒక ప్రముఖ వ్యక్తిని కిడ్నాప్ చేయించి ఆ
పథకం ద్వారా అసలు కిడ్నాపర్స్ ని పట్టుకోవలనేది ఈ పథకం. ఇదే సమయంలో దిలీప్
కుమార్ కూతురు అయిన ప్రియ ని ప్రేమించానని తనకి ప్రియని ఇచ్చి
పెళ్ల్లి చెయ్యమని దిలీప్ కుమార్ దగ్గరకి వస్తాడు రాజా.. అప్పుడు దిలీప్ కుమార్
తను అనుకున్న పథకానికి రాజా ని ఉపయోగించాలని నిర్ణయించుకుంటాడు.
దీనికి రాజా కూడా ఒప్పుకుంటాడు.. దిలీప్ కుమార్ రాజా ద్వారా
కిడ్నాపర్స్ ని పట్టుకున్నారా? అసలు ఈ కిడ్నాప్ లు చేయిస్తున్నది ఎవరు? అనే అంశాలు
మిగిలిన కథ..
నటినటులు
:
శర్వానంద్ - రాజా పాత్రలో శర్వానంద్ మంచి జోష్ ఉన్న యువకుడిగా కనిపించాడు. స్టైల్స్ తో శర్వానంద్ గతంలో కంటే మరింత ఆకర్షణీయంగా కనిపించాడు. స్టైల్స్ తోపాటు యాక్టింగ్ పరంగా కూడా మంచి ఫెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. యువ హీరోల పోటీలో శర్వానంద్ కు ఈ చిత్రం మరింత పేరు సంపాదించి పెడుతుందని చెప్పవచ్చు.
శర్వానంద్ - రాజా పాత్రలో శర్వానంద్ మంచి జోష్ ఉన్న యువకుడిగా కనిపించాడు. స్టైల్స్ తో శర్వానంద్ గతంలో కంటే మరింత ఆకర్షణీయంగా కనిపించాడు. స్టైల్స్ తోపాటు యాక్టింగ్ పరంగా కూడా మంచి ఫెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. యువ హీరోల పోటీలో శర్వానంద్ కు ఈ చిత్రం మరింత పేరు సంపాదించి పెడుతుందని చెప్పవచ్చు.
సీరత్ కపూర్ - సీరిత్ కపూర్ తన
అందాలతో ఆకట్టుకోలేకపోయినా తన అభినయంతో పాత్రకి కావలసిన ప్రాముఖ్యతను తీసుకు
రాగలిగింది.
పోలీస్ కమిషనర్ గా సంపత్ తన పాత్ర పరిధి మేరకు పర్వాలేదనించాడు. శర్వానంద్ తండ్రిగా
జయప్రకాశ్ ది ఓ ముఖ్యమైన పాత్రే. సంపత్, జయప్రకాశ్ లు తమ పాత్రలకు న్యాయం
చేకూర్చారు. గత చిత్రాలలో కన్నా ఈ చిత్రంలో అడివి శేష్ నటన చాలా మెరుగుపడింది అని చెప్పుకోవచ్చు
అంతే కాకుండా ఈ పాత్ర అతని నటనకి సరిగ్గా సరిపోయింది కోట శ్రీనివాస్
రావు , వెన్నెల
కిషోర్ మరియు జబర్దస్త్ శంకర్ కొన్ని సన్నివేశాలలో బాగా నవ్వించారు. ఇంతే కాకుండా కొందరు
లఘు చిత్ర నటులు కూడా అక్కడక్కడా కనిపించి నవ్వించడంలో తమ పాత్ర పోషించారు..
ప్లస్
పాయింట్స్:
సంగీతం
సంగీతం
సినిమాటోగ్రఫీ
కామెడీ
మైనస్ పాయింట్స్:
సెకండ్ హాఫ్ సాగదీయడం
మైనస్ పాయింట్స్:
సెకండ్ హాఫ్ సాగదీయడం
సాంకేతిక
వర్గం పనితీరు:
ఈ చిత్రంతో దర్శకునిగా పరిచయం అయిన సుజీత్ అతనికి ఇది మొదటి సినిమానే అయిన
ఎక్కడ తడబడకుండా సినిమాని చాల పర్ఫెక్ట్ గా తీసాడు. కథ , చాలా చిన్న
పాయింట్ ని తన కథా వస్తువుగా ఎంచుకొని దానికి సరదాగా సాగే కథనాన్ని
రాసుకోగాలిగారు దర్శకుడు సుజీత్ , నిజానికి ఈ కథ అంత గొప్పగా ఎం ఉండదు కాని
పాత్రలను మలచిన తీరు అవి ప్రవర్తించే విధానం చాలా సరదాగా సాగడంతో
చిత్రం ఎక్కాడా బోర్ కొట్టదు , అంతే కాకుండా కథనం కూడా చాలా ఫ్రెష్ గా ఉంటుంది.
ఇక ఈ కథనానికి ఫన్నీ డైలాగ్స్ ప్రాణం పోసింది అని చెప్పాలి.
మిర్చి చిత్రానికి ఫొటోగ్రఫినందించిన మధి మరోసారి తన సత్తాను చూపించాడు. ఈ చిత్రంలో మధి
అందించిన ఫొటోగ్రఫీ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ప్రతి ఫ్రేమ్ లోను కలర్స్ వినియోగించిన
తీరు బాగుంది. యాక్షన్ సీన్లు, రొమాంటిక్ సీన్లను తెరకెక్కించిన విధానం 'రన్ రాజా రన్'కు హైలెట్
నిలుస్తాయని చెప్పవచ్చు.
రాజ్ సుందరం అందించిన కోరియోగ్రఫీ
పాటలకు మరింత ట్రేండిగా మార్చాయి. ఎడిటింగ్ కూడా పర్‌ఫెక్ట్‌గా ఉంది. సినిమాలో
ఎక్కడా ల్యాగ్ అస్సల్లేదు. చిన్న సినిమా అయినా కానీ నిర్మాతలు ఎక్కడా
రాజీ పడలేదు. క్వాలిటీ పరంగా రన్ రాజా రన్ పెద్ద
సినిమాలకి తీసిపోని విధంగా తెరకెక్కింది. ఇంకా ఈ చిత్రం
బాగుండటానికి ప్రధాన కారణం గిభ్రన్ సంగీతం , ఈ చిత్ర పాటలు మరియు నేపధ్య సంగీతం చాలా కొత్తగా ఉండటంతో చిత్రానికి
తాజాతనం చేకూరింది. అంతే కాకుండా కీలక
సన్నివేశాలను ఇతని నేపధ్య సంగీతం నిలబెట్టింది అని చెప్పుకోవచ్చు
ఈ చిత్రంలో ఫస్ట్ హాఫ్ లో కామెడీ,
రొమాంటిక్ ట్రాక్ చూపించి, సెకండ్ హాఫ్ లో అసలు కథ లోకి వచ్చాడు దర్శకుడు. ఫస్ట్
హాఫ్ తో పోలిస్తే సెకండ్ హాఫ్ కొంచం నెమ్మదించింది. శర్వానంద్ ఫ్రెష్ లుక్ అండ్
పెర్ఫార్మన్స్, ఫస్ట్ హాఫ్, చివరి 20 నిమిషాలు, మధి సినిమాటోగ్రఫీ, జిబ్రాన్
మ్యూజిక్ ఈ సినిమాకి మేజర్ హైలైట్స్ అయితే సెకండాఫ్ ని డ్రాగ్ చెయ్యడం, అలాగే సినిమాలో వచ్చే
ట్విస్ట్ లు ఆడియన్స్ గెస్ చేసేలా ఉండడం
సినిమాకి మైనస్ పాయింట్స్. ఒక చిత్ర కథతో సంభంధం లేకుండా ఆసాంతం ఎంజాయ్ చెయ్యగలిగితే
మంచి చిత్రం అంటే ఇది మంచి చిత్రం.. ఈ వారం
విడుదల అయిన చిత్రాలలో ఇది బెస్ట్ చిత్రం.. ఈ వారం బాక్స్ ఆఫీస్ దగ్గర విజేత ఈ చిత్రం అని ఆలోచించకుండా
చెప్పెయవచ్చు... ఇక ఆలోచించడం ఎందుకు వెంటనే
దగ్గరలోని థియేటర్ కి వెళ్ళిపొండి..
చేకోడి
రేటింగ్ : ★★★ – 3/5
Post a Comment