GuidePedia

0

మెట్రో రైలు పట్టలేక్కింది - ట్రయల్ రన్

హైదరాబాదు మెట్రో రైలు పట్టాలెక్కింది! గురువారం నాగోల్ నుండి సర్వే ఆఫ్ ఇండియా వరకు అధికారులు ట్రయల్ రన్ నిర్వహించారు. మెట్రో రైలు తొలిసారి ట్రాక్ పైకి ఎక్కింది. నాగోలు మెట్రో డిపో నుండి సర్వే ఆఫ్ ఇండియా వరకు ఈ ట్రయల్ చెక్ చేశారు. కీలోమీటరు వరకు ట్రాక్, కోచ్ పని తీరును అధికారులు పరిశీలించారు. ప్రయోగాత్మకంగా తొలిసారి ట్రాక్ పైకి మెట్రో రైలును ఎక్కించారు. ఇంజిన్, మూడు బోగీలతో ఈ టెస్ట్ రన్ నిర్వహించారు. కాగా, ట్రయల్ రన్‌కు ముందు అధికారులు ప్రత్యేక పూజలు చేసినట్లుగా తెలుస్తోంది. కాగా, హైదరాబాద్ మెట్రోరైలు దేశంలోని ఇతర మెట్రో రైలు నిర్మాణ పనుల రికార్డులను అధిగమించిన విషయం తెలిసిందే. కేవలం 20 నెలల వ్యవధిలో రికార్డు స్థాయిలో 27 కిమీ పొడవున 1000 వయోడక్ట్‌లను ఏర్పాటు చేసినట్టు హైదరాబాద్ మెట్రోరైలు మేనేజింగ్ డైరెక్టర్ ఎన్‌విఎస్ రెడ్డి పది రోజుల క్రితం ప్రకటనలో తెలిపారు.

Post a Comment

 
Top