GuidePedia

0

నాని కొత్త సినిమా మారుతితో!

చిన్న సినిమాల‌తో సంచ‌ల‌న విజ‌యాలు అందుకొంటూ ప‌రిశ్ర‌మ‌ను ఆక‌ర్షించిన ద‌ర్శ‌కుడు మారుతి. `కొత్త‌జంట‌` త‌ర్వాత స్టార్ హీరోల‌తో సినిమాలు చేయాల‌నుకొన్నాడు. కానీ వ‌ర్కవుట్ కాలేదు. `కొత్త‌జంట‌` పెట్టిన పెట్టుబ‌డిని వెన‌క్కి తీసుకొచ్చినామారుతి తీత‌లో మాత్రం మునుప‌టితో పోలిస్తే ప‌స త‌గ్గిపోయింద‌నే కామెంట్లు వినిపించాయి. సినిమాని విమ‌ర్శ‌కులు చీల్చిచెండాడారు. దీంతో మారుతితో సినిమా చేయాల‌నుకొన్న ఒక‌రిద్ద‌రు స్టార్ క‌థానాయ‌కులు కూడా వెన‌క్కిత‌గ్గారు. ఇక చేసేదేం లేకసునీల్‌ని దృష్టిలో ఉంచుకొని ఓ క‌థ రాసుకొన్నాడు మారుతి. రేపో మాపో సినిమాకి కొబ్బ‌రికాయ కొడ‌తార‌న్న ప్ర‌చారం కూడా సాగింది. కానీ ఇంత‌లో ఓ టెక్నిక‌ల్ స‌మ‌స్య వ‌చ్చి సునీల్ ఆ సినిమా నుంచి త‌ప్పుకొన్నాడు. అది మొద‌లు మారుతి క‌థానాయ‌కుల కోసం అన్వేష‌న కొన‌సాగిస్తూనే ఉన్నాడు. బోలెడ‌న్ని క‌థ‌లు వెంట‌బెట్టుకొని క‌నిపించిన క‌థానాయ‌కులంద‌రికీ చెబుతూ వ‌స్తున్నాడు. తాజాగా నానికి కూడా ఓ క‌థ వినిపించాడ‌ట‌. ఆయ‌న సినిమా చేయ‌డానికి ఒప్పేసుకొన్న‌ట్టు కూడా ఫిల్మ్‌న‌గ‌ర్‌లో ప్ర‌చారం సాగుతోంది. మ‌రి ఆ క‌థ సునీల్‌కి చెప్పిందేనా లేదంటే వేరొక‌టి త‌యారు చేసి చెప్పాడా అన్న‌ది తేలాల్సివుంది. త్వ‌ర‌లోనే ఈ సినిమా కొబ్బ‌రికాయ కొట్టుకొనే అవ‌కాశాలున్నాయ‌ని తెలుస్తోంది.

Post a Comment

 
Top