అందరి టార్గెట్ పవన్ కళ్యాణ్ నే !!
ఓ వైపు ఆంధ్రప్రదేశ్ లో కొంతమంది రాజకీయ వేత్తలు , మరికొన్ని కుల
సంఘాలు పవన్ ప్రచరం వల్లనే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందని కామెంట్
చేస్తుంటే… మరోవైపు విడుదలవుతున్న చాలా సినిమాల్లో దర్శకులు
పవన్ ప్రస్తావన ఏదోలా తీసుకొస్తూ ప్రేక్షకులని మాయ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
అందుకు ఉదాహరణగా మొన్న శుక్రవారం విడుదలైన గాలిపటం, గీతాంజలి
పేర్లు చెప్పుకోవచ్చు .ఈ రెండు సినిమాల్లో కూడా పవన్ ప్రస్తావన ఉన్నది. అయితే ఈ
రెండు సినిమాలు చూస్తున్న ప్రేక్షకులు ఆ సినిమా కథ తీరు పట్ల అసహనంగా ఉండడంతో
మధ్యలో పవన్ ప్రస్తావనలు వచ్చినా అవి ప్రేక్షకులకు పెద్దగా కిక్
ఇవ్వలేకపోతున్నాయి. గతంలో చాలా సినిమాల్లో చిరంజేవి ప్రస్తావనలతో సినిమాలు వచ్చినా
ఆ సినిమాల విజయావకాశాలను చిరంజీవి ప్రస్తావనలు గట్టేక్కించలేక పోయింది.ఇప్పుడు పవన్
ప్రస్తావన ప్రధాన ధ్యేయంగా పెట్టుకొని సన్నివేశాల రూపకల్పన విషయంలో ఆలోచించే మన
దర్శకులు ఆ సినిమాల కథల విషయంపై కాస్త బుర్ర పెడితే మంచి సినిమాలు వచ్చే అవకాశం
ఉన్నది. అటు రాజకీయాల్లో అయిన ,సినిమాల్లో వ్యక్తీ భజన అయినా
కానీ సినిమాని గట్టెక్కించ లేవు అం విషయాన్ని తెలుసుకోకుండా ఇలా ప్రతిసారి పవన్
భజన చేస్తూ పొతే ఎదో ఒకరోజు వెగటు పుట్టే అవకాశం ఉన్నదనే విషయాన్ని మన నాయకులూ ,
దర్శకులు ఎప్పుడు గుర్తిస్తారో !
Post a Comment