GuidePedia

0


మాసంటే బ‌స్సు పాసు కాదు రాఅంటూ ర‌వితేజ సంద‌డి చేస్తున్నాడు. `ప‌వ‌ర్‌` సినిమాకోస‌మే ఆ సంద‌డంతా. చిత్రీక‌ర‌ణ తుదిద‌శ‌కు చేరుకొన్న ఆ సినిమా తాజాగా పాట‌ల వేడుక‌ని జ‌రుపుకొంది. ఆదివారం రాత్రి హైద‌రాబాద్‌లోని శిల్పక‌ళావేదిక‌లో `ప‌వ‌ర్` పాట‌ల వేడుక జ‌రిగింది. తొలి సీడీని వి.వి.వినాయ‌క్ ఆవిష్క‌రించారు. క‌ర్ణాట‌క ఎమ్మేల్యే మునిర‌త్నం స్వీక‌రించారు. ర‌వితేజ‌, హ‌న్సిక‌, రెజీనా ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన ఈ సినిమాకి త‌మ‌న్ సంగీతం అందించారు. బాబీ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నాడు. రాక్‌లైన్ వెంక‌టేష్ నిర్మించారు.
ర‌వితేజ మాట్లాడుతూ సినిమా బృంద‌మంతా క‌లిసి క‌ట్టుగా ప‌నిచేస్తే ఓ వండ‌ర్‌ఫుల్ ప్రాజెక్ట్ బ‌య‌టికొస్తుంది. అందుకే `ప‌వ‌ర్‌` మ‌రో ఉదాహ‌ర‌ణ‌గా నిలుస్తుంది. హన్సిక‌, రెజీనా వండ‌ర్‌ఫుల్ క‌థానాయిక‌లు. చాలా బాగా న‌టించారు. బాబీ సినిమా చాలా బాగా తీర్చిదిద్దాడు. తన రూపంలో తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌కు ఓ గొప్ప ద‌ర్శ‌కుడు రాబోతున్నాడు. ఈ సినిమా కోసం అంద‌రూ క‌ష్ట‌ప‌డి ప‌నిచేశారు. త‌మ‌న్ సంగీతం చాలా బాగుంది. మేమిద్ద‌రం క‌లిసి ఏడు సినిమాలు చేశాం. వాటిలో హిట్లున్నాయి, యావ‌రేజ్‌లున్నాయి, ఫ్లాపులున్నాయి. కానీ త‌మ‌న్ సంగీతం మాత్రం ఎక్క‌డా ఫ్లాప్ కాలేదు. నా సినిమాకంటే త‌ను ప్రత్యేకంగా పాట‌లు అందిస్తుంటాడు. రాక్‌లైన్ వెంక‌టేష్ ఈ సినిమాతో తెలుగు ప‌రిచ‌యం అవుతున్న‌ట్టుందుకు ఆనందంగా ఉంది. ఆయ‌న‌కి డ‌బ్బుతో పాటు మంచి పేరు తీసుకొస్తుందీ చిత్రంఅన్నారు.
వి.వి.వినాయ‌క్ మాట్లాడుతూర‌వితేజ నాకు బావ‌. మేమిద్దరం ఒక‌రినొక‌రు బావ బావ అని పిలుచుకొంటుంటా. నేను స‌హాయ ద‌ర్శ‌కుడిగా ఉన్నప్పుడు ర‌వితేజ‌ని దృష్టిలో ఉంచుకొని క‌థ‌లు రాసుకొనేవాణ్ని. మా క‌థ‌ల‌కు తొలి ప్రేక్ష‌కుడు కూడా త‌నే. నేను సురేంద‌ర్ రెడ్డి కలిసి ర‌వితేజ‌కి క‌థ‌లు వినిపించేవాళ్లం. ఆ త‌ర్వాత ర‌వితేజ‌తో నేను `కృష్ణ‌` చేశాను, సురేంద‌ర్ రెడ్డి `కిక్` చేశాడు. ఈ చిత్ర ద‌ర్శకుడు బాబీ నాకు త‌మ్ముడిలాంటివాడు. త‌ను `అల్లుడు శీను`కి క‌థ‌ని అందించి చిత్ర విజ‌యానికి తోడ్పాటునందించాడు. ప్రేక్ష‌కుల‌కు ఏం కావాలో త‌న‌కు బాగా తెలుసు. అందుకు త‌గ్గ‌ట్టుగానే ఈసినిమాని తీశాడు. త‌ప్ప‌కుండా ఈ సినిమా విజ‌యవంతం అవుతుంది. త‌మ‌న్ పాట‌లు చాలా బాగున్నాయిఅన్నారు.
బాబీ మాట్లాడుతూర‌వితేజ‌కి `బ‌లుపు` చిత్రీక‌ర‌ణ జ‌రుగుతున్న‌ప్పుడే ఈ క‌థ చెప్పాను. ఇంట‌ర్వెల్ వ‌ర‌కు క‌థ విని ఈ సినిమా మ‌నం చేస్తున్నాం అన్నారు. ఆ త‌ర్వాత `బ‌లుపు` విడుద‌లైంది, విజ‌యం సాధించింది. దీంతో పెద్ద పెద్ద ద‌ర్శ‌కులు ర‌వితేజ‌ని సంప్ర‌దించారు. కానీ ఆయ‌న మాత్రం నాకు ఇచ్చిన మాట మేర‌కు నాతోనే సినిమా చేశారు. ఈ సినిమా కోసం ఓ స‌హాయ ద‌ర్శ‌కుడిలా ఆయ‌న క‌ష్ట‌ప‌డ్డారు. రాజ‌మౌళి, వినాయ‌క్‌లాంటి ద‌ర్శ‌కుల‌తో క‌లిసి ప‌నిచేసిన ర‌వితేజలాంటి స్టార్ కథానాయ‌కుడు `ప‌వ‌ర్` కోసం అందించిన స‌హ‌కారం మ‌చిరిపోలేనిదిఅని చెప్పారు.
నిర్మాత మాట్లాడుతూ  నాకు బెంగుళూరులో ఓ మ‌ల్టీప్లెక్స్ థియేట‌ర్ ఉంది. అక్క‌డికి అంద‌రి అభిమానులూ క‌లిసి ర‌వితేజ సినిమా చూడ‌టానికి వ‌స్తారు. ఆయ‌న‌తో సినిమా చేయ‌డం చాలా హ్యాపీగా ఉంది. త‌ప్ప‌కుండా ఈ చిత్రంతో విజ‌యాన్ని సొంతం చేసుకొంటాంఅన్నారు. ఈ వేడుకలో దిల్రాజు, కోన వెంకట్, అజయ్, సునిల్ తదితరులతో పాటు పలువురు కన్నడ చిత్రరంగ ప్రముఖులు పాల్గొన్నారు.








Post a Comment

 
Top