GuidePedia

0

ఆగడు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కాపీ కాదు : తమన్

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా సినిమా ఆగడుబ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కాపీ అంటూ మీడియా చేసిన ఆరోపణలపై స్పందించారు సంగీత దర్శకుడు తమన్. కృష్ణ, మహేష్ బాబుల పుట్టిన రోజు సందర్భంగా రెండు టీజర్లను విడుదల చేశారు. వీటిలో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్మలయాళంలో ఇటివల విడుదలైన అవతారంసినిమా ట్రైలర్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఒకేలా ఉండడంతో తమన్ కాపీ కొట్టాడు అని కొన్ని న్యూస్ చానల్స్ లో స్పెషల్ ప్రోగ్రామ్స్ వేశారు. వీటిని ఖండించారు తమన్.
నిజానికి మలయాళం సంగీత దర్శకుడు దీపక్ దేవ్ ఆగడుబ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ను కాపీ కొట్టారు. ఆగడుటీజర్ మే 30న ఇంటర్నెట్ లో రిలీజ్ చేశారు. ఆ తర్వాత జూలై 16న మలయాళం మూవీ అవతారంట్రైలర్ వచ్చింది. 45 రోజుల తర్వాత రిలీజ్ అయిన ట్రైలర్లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తమన్ ఎలా కాపీ చేస్తారు..? అసలు విషయం తెలుసుకోకుండా తెలుగు మీడియా తమన్ పై నిందలు వేసింది.
దూకుడు’, ‘బిజినెస్ మాన్చిత్రాల తర్వాత మహేష్ బాబుతో తమన్ చేస్తున్న హట్రిక్ మూవీ ఇది. అలాగే తమన్ 50వ సినిమా కూడా. ఈ సినిమా సంగీతం విషయంలో తమన్ ఎంతో కేర్ తీసుకుంటున్నారు.

Post a Comment

 
Top