సమాంత రేటు రెండు నిమిషాలకు 10 లక్షలoట!!
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న అందాల
భామ సమంతకు డబ్బు పిచ్చి బాగా ఎక్కువయ్యినట్లుగా అనిపిస్తోంది. టాలీవుడ్ లో టాప్
రేంజ్ లో ఉన్న హాట్ సమంత ఇటీవలే చీరకట్టి ఓ ఫ్యాషన్ వీక్ లో ర్యాంప్ పై క్యాట్
వాక్ చేసింది. ప్రస్తుతం తెలుగు, తమిళ చిత్రాల్లో బిజీగా వున్న ఈ అమ్మడు తన
రెమ్యునరేషన్ ను రోజురోజుకు పెంచేసుకుంటూ వెళుతుంది.హీరోయిన్లకు సినిమాల ద్వారా
మాత్రమే కాకుండా బయట షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ లతో కూడా భారీ రెమ్యునరేషన్ తీసుకుంటారనే
విషయం అందరికి తెలిసిందే. అందరూ హీరోయిన్లు సమంత మాత్రం ‘దీపం
వున్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి’ అనే ఫార్ములాను ఫాలో
అవుతారు. కానీ సమంత ఈ ఫార్ములాను ఇంకొంచెం ఎక్కువగానే వాడుకుంటుంది. గ్లామర్
వున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలి లేదంటే గ్లామర్, వయసు
రెండు తరిగిపోయాక ఎవరు కూడా పట్టించుకోరు. ఈ విషయాన్ని సమంత బాగా త్వరగా
తెలుసుకుంది. తాజాగా హైదరాబాద్‌లో ఓ ష్యాషన్ షోకి అటెండ్ అయిన సమంత.. అక్కడ తాను ఎండార్స్
చేస్తున్న సంస్థ తరపున అటుఇటూ హోయలొలికిస్తూ ర్యాంప్ వాక్ చేసింది. అక్కడికి
రావడానికి ఒక రేటు కాగా.. అలా ర్యాంప్ వాక్ చేసినందుకు అదనంగా సమంత మరో 10 లక్షల రూపాయల వసూలు చేసిందట. జస్ట్
రెండంటే.. రెండే నిమిషాలు అటూఇటు నడిపించినందుకు నిర్వాహకులకు అంత పెద్ద మొత్తం వదులుకోకతప్పలేదు.
Post a Comment