GuidePedia

0

ఇంటర్వ్యూ - నా సంపాదన గురించి వారికెందుకు !! : తమన్నా



మీ ఐటమ్ సాంగ్ రెస్పాన్స్ ఎలా ఉంది?
 బావుందండీ... అందరూ అభినందిస్తున్నారు. తమన్నా మంచి డాన్సర్ అని అందరూ అంటున్నారంటే కారణం బద్రీనాథ్సినిమా. ఆ సినిమాకు దర్శకుడు వినాయక్‌గారే. ఇప్పుడు ఆయన సినిమా కోసమే ఐటమ్ నంబర్ చేయడం ఆనందంగా ఉంది.  శ్రీనివాస్‌లో మంచి ఫైర్ ఉంది. తనకు పోటీగా డాన్స్ చేయడానికి చాలా కష్టపడ్డాను.
 
 హీరోయిన్‌గా మంచి స్టేజ్‌లో ఉండి.. ఐటమ్ సాంగ్ చేయడానికి ప్రత్యేకమైన కారణం?
 మంచి మనుషులందరూ కలిసి పని చేసిన సినిమా ఇది. అందుకే... వారితో కాసేపైనా కలిసి పని చేయాలనిపించింది. రెండు మూడు రోజుల్లో పాట చిత్రీకరణ పూర్తయ్యింది. ఈ టీమ్‌ని వదిలి వెళ్లడం బాధనిపించింది.
 
 ఒక్క పాటకు రెండు కోట్లు తీసుకున్నట్లు వార్తలొస్తున్నాయి. నిజమేనా?
 ఆ రాసిన వాళ్ల సంపాదన నేను అడగలేదు కదా. అలాంటప్పుడు నా సంపాదనతో వారికి పనేంటి? నాలాంటి ఇమేజ్ ఉన్న హీరోయిన్ ఈ సినిమాలో ఓ సాంగ్ చేస్తే సినిమాకి హెల్ప్ అవుతుందని దర్శక, నిర్మాతలు భావించారు. నాకు ఎంతివ్వడం కరెక్టో వారికి తెలుసు. అంతకు మించి అడిగే మనస్తత్వం కూడా కాదు నాది. ఇది స్నేహధర్మంగా చేసిన పాటే.
 
 మీ బాలీవుడ్ ఫిలిం హమ్‌షకల్అంతగా ఆడలేదు కదా!
 అదంత బ్యాడ్ మూవీ ఏం కాదు. కానీ... దానికి అనుకున్నదానికంటే ఎక్కువ విమర్శలొచ్చాయి. ఒక నటిగా సినిమాకు పనిచేస్తాను అంతే.. సినిమా సక్సెస్ అనేది నా చేతిలో ఉండదు కదా. తెలుగులో నేను చేసిన తొలి సినిమా శ్రీపెద్దగా ఆడలేదు. ఆ తర్వాత కూడా వరుసగా నాలుగు ఫ్లాపులొచ్చాయి. నా అయిదవ సినిమా హ్యాపీడేస్’. మొదట్లో ఎదురైన ఫ్లాపులకే నేను భయపడి ఉంటే హీరోయిన్‌గా ఇంత సాధించి ఉండేదాన్ని కాదు కదా.
 
 ఇట్స్ ఎంటర్‌టైన్‌మెంట్ప్రమోషన్‌లో ఉన్నట్లున్నారు?
 అవును... సౌత్‌తో పోలిస్తే బాలీవుడ్‌లో ప్రమోషన్‌కి ఎక్కువ రోజులు కేటాయించాలి. ఇట్స్ ఎంటర్‌టైన్‌మెంట్సినిమా బాగా వచ్చింది. సక్సెస్ అవుతుందనుకుంటున్నా.  
 
 బాలీవుడ్ కారణంగా సౌత్‌లో సినిమాలు తగ్గినట్టున్నాయి?
 దక్షిణాదిన బిజీగానే ఉన్నాను. తెలుగులోఆగడు’, ‘బాహుబలి’, తమిళంలో ఆర్య హీరోగా రూపొందుతోన్న సినిమా చేస్తున్నాను. ఇవేమీ ఓ మూడు నెలల్లో పూర్తయ్యే సినిమాలు కావు. అన్నీ భారీ సినిమాలే. టైమ్ పడుతుంది. బాలీవుడ్‌లో కూడా కొన్ని కమిట్‌మెంట్లు ఉన్నాయి. ప్రస్తుతం క్షణం తీరిక లేకుండా ఉన్నాను. ఇంతకంటే ఫాస్ట్‌గా సినిమాలు చేయలేను.
 
 బాహుబలిఅనుభవాలు చెప్పండి?
 బాహుబలిసెట్‌లో ఉన్నంతసేపూ ఓ గొప్ప నటిగా ఫీలవుతున్నాను. సాధారణంగా నాకు ఒంటిగంటకల్లా ఆకలేస్తుంది. కానీ... ఆ సెట్‌లో ఉంటే ఆకలే వేయడం లేదు. తర్వాత షాట్ ఎలా పెడతారు, ఎలాంటి సీన్ తీస్తారు... ఇవే ఆలోచనలు. ఇందులో నాది వారియర్ ప్రిన్సెస్ పాత్ర. ఈ సినిమా రెండు భాగాలుగా తీస్తున్న విషయం తెలిసిందే. నేను తొలి భాగంలో ఉంటాను. ఇటీవలే నేనూ, ప్రభాస్ పాల్గొనగా ఓ పాట తీశారు. సాధారణంగా రోప్స్ అనేవి ఫైట్లకు వాడతారు. కానీ ఈ పాటకోసం వాడారు.
 
 ఆగడులో మీరు పోలీస్ అంట కదా?
 లేదు.. ఇందులో నాది పల్లెటూరి అమ్మాయి పాత్ర. మహేశ్‌తో ఎప్పుడో చేయాల్సింది. ఇన్నాళ్లకు కుదిరింది. శ్రీనువైట్ల రెడీలో ప్రత్యేక పాత్ర చేశాను. అప్పట్నుంచి ఆయనతో సినిమా చేయాలని ఉండేది. ఇన్నాళ్లకు కుదిరింది. సినిమా సూపర్బ్‌గా వస్తోంది. మహేశ్ ఫ్యాన్స్‌కి మంచి ట్రీట్ ఈ సినిమా.
 
 జగదేక వీరుడు- అతిలోక సుందరిరీమేక్‌లో మీరే కథానాయిక అని టాక్?
 నేనూ, రాఘవేంద్రరావుగారు, చిరంజీవిగారూ కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొన్నాం. ఆ కార్యక్రమ వ్యాఖ్యాత...జగదేకవీరుడు...మళ్లీ తీస్తే చరణ్‌కి జోడీగా ఎవరు బాగుంటారు? అని రాఘవేంద్రరావుగారిని అడిగింది. ఆయన... దానికి సమాధానం చిరంజీవి చెబితే బావుంటుందన్నారు. అప్పుడు చిరంజీవిగారు నా పాత్రను చరణ్, శ్రీదేవి పాత్రను తమన్నా చేస్తే బావుంటుందని అన్నారు. అంతే తప్ప అలాంటి ప్రపోజల్ ఏదీ నా దగ్గరకు రాలేదు.
 
 ఈ మధ్య కాస్త తగ్గినట్టున్నారు?
 హిందీ సినిమా కోసం తగ్గాను. అక్కడ హీరోయిన్లందరూ ఫిట్‌గా ఉంటారు. అందుకే... ఇలా తయారయ్యా. అయిదు కేజీలు తగ్గాను.
 
 మరి ఇక్కడ హీరోయిన్లు బొద్దుగా ఉండాలి కదా. ఎలా?
 మనిషికి ఒక ఎలాస్టిక్ స్వభావం ఉంటే ఎంత బావుణ్ణో కదా. చక్కగా ఇక్కడ లావుగా, అక్కడ సన్నగా కనిపించొచ్చు.
 
 ఇంతకీ పెళ్లెప్పుడు ప్లాన్ చేశారు?
 ప్లాన్ చేసుకొని పెళ్లి చేసుకుంటారా? ప్లాన్ చేసి ప్రేమలో పడతారా? మీరు అలా చేశారా? చెప్పండి?

Post a Comment

 
Top