ఆగడు సెన్సార్ రిపోర్ట్ - U/A
మహేష్
బాబు నటించిన ‘ఆగడు' చిత్రాన్ని ఈ నెల 19న గ్రాండ్‌గా విడుదల చేసేందుకు
ఏర్పాట్లు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను
పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి U/A సర్టిఫికెట్ జారీ చేసింది. అంటే పెద్దలతో
పాటు పిల్లలు కూడా వెళ్లి ఈ సినిమా నిరభ్యరంతంగా చూడొచ్చని అర్థం. ఈ మధ్య
పలువురు స్టార్ హీరోల సినిమాల్లో హింస, రొమాన్స్ శృతి మించుతుండటంతో సెన్సార్
బోర్డు A(పెద్దలకు
మాత్రమే) సర్టిఫికెట్ జారీ చేస్తున్న నేపథ్యంలో.....ఫ్యామిలీ ప్రేక్షకులు ‘ఆగడు' సెన్సార్ రిపోర్టు కోసం ఆసక్తిగా
ఎదురుచూస్తున్నారు. సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ జారీ చేయడంతో ఫ్యామిలీ
ప్రేక్షకులు ఊపిరి పీల్చుకున్నారు.
Post a Comment