GuidePedia

0


సర్జరీ చేయించుకోబోతున్న సమంత !!

సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న యాక్టర్ సమంత. ప్రస్తుతం సమంత కాల్షీట్స్ దొరకాలంటే దాదాపు సంవత్సరం పైగా వెయిట్ చెయాల్సిన అవసరం ఉంది. దాదాపు తన చేతిలో ఓ నాలుగు క్రేజీ ప్రాజెక్ట్స్ ని పెట్టుకుంది. ఇవి కాకుండా తను ఒప్పుకుంటే మరో ఆరు ప్రాజెక్ట్స్ కి సైన్ చేయాల్సి ఉంటుంది. అందుకే ఒకే సారి అన్ని మూవీలను ఒప్పుకోకుండా, ఓ నాలుగు చిత్రాలను మాత్రం ఎప్పుడూ తన చేతిలో పెట్టుకుంటూ వస్తుంది సమంత. ఇదిలా ఉంటే కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వినిపిస్తున్న కథనం ప్రకారం సమంత తన ముక్కుని సర్జరీ చేయించుకునే ప్లానింగ్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది. సమంత అందాలకు యూత్ మాత్రమే కాకుండా, ఫిల్మ్ ఇండస్ట్రీ సైతం ఫిదా అవుతుంది. సమంత ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎంట్రి ఇచ్చినప్పటి కంటే ఇప్పుడు చాలా గ్లామరస్ గా కనిపిస్తుంది. అయితే తన ముఖంలో ముక్కు భాగం కొద్దిగా లావుగా ఉన్నట్టు భావించిన సమంత, ముక్కుని సన్నగా చేసుకోవాలని ఆలోచిస్తుందట. అయితే ఇప్పటికే ఒక సారి ముక్కుని సర్జరీ చేయించుకున్న సమంత, ఇప్పుడో రెండో సారి ఫైనల్ షేప్ కోసం వెళుతుంది. ఇప్పటికే లండన్ లో నోస్ రి-షేపింగ్ కోసం ఓ సర్జరి సెంటర్ ని సైతం సంప్రదించి , సమంత అన్ని విషయాలను తెలుసున్నట్టు కోలీవుడ్ లో కథనాలు వినిపిస్తున్నాయి. సమంత మరో నెల రోజుల్లో లండన్ వెళ్ళి తన ముక్కు సర్జరీని చేయించుకుంటున్నట్టుగా కోలీవుడ్ లో బలమైన కథనాలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలపై ఓ రిపోర్టర్ సమంతని అడగగా, తను ఎటువంటి సర్జరీ చేయించుకోవడం లేదని చెబుతుంది. కాని సమంత సర్జరీ చేయించుకోవటానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేయించుకుందని, తను సర్జరీ చేయించుకున్న తరువాత ఓ వారం రోజుల పాటు ఎటువంటి షూటింగ్ లో పాల్గొనడం లేదని కోలీవుడ్ లో టాక్స్ వినిపిస్తున్నాయి. ముక్కు ని రి-షేప్ చేయించుకోవడం ఫిల్మ్ సెలబ్రిటీస్ ఇదే మొదటి సారి కాదు. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇది సర్వసాధారణంగా జరిగే చిన్న మేటర్ మాత్రమే. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీకి మాత్రం ఇది స్పెషల్ న్యూసే అని అంటున్నారు. సమంత కొత్త ముఖ అందాలను త్వరలోనే చూడబోతున్నాం అని ఫిల్మ్ ఇండస్ట్రీ సైతం అంటుంది.

Post a Comment

 
Top