GuidePedia

0

ఆగాడు - స్పెషల్ చబ్బిస్ కి కాపీ అంటా ??

ఇప్పుడు టాలీవుడ్ లో చాలా టాపిక్స్ ఆగడు కథ లీకైందన్నదానిపైనే నడుస్తున్నాయి.. అయితే ఈ కథ యాజ్ ఇట్ ఈజ్ గా బాలీవుడ్ హిట్ మూవీ స్పెషల్ ఛబ్బీస్ కు దగ్గరగా ఉందనేది స్పష్టంగా వినిపిస్తోంది. కాకపోతే అక్కడ హీరో ఫేక్ కలెక్టర్ గా ఉంటాడు.. ఇక్కడ ఫేక్ పోలీస్ అన్నమాట.. ఇందులో మహేష్ బాబు.. ఫస్టాఫ్ అంతా పోలీస్ గా ఇరగదీస్తాడట. కానీ ఇంటర్వెల్ టైమ్ కు ఇతను పోలీసే కాదు అనే అసలు విషయం తెలుస్తుందట..అంటే ఇదే ఇంటర్వెల్ బ్యాంగ్ అన్నమాట. మరి పోలీస్ కాకుండా ఆ గెటప్ ఎందుకు వేశాడు.. ఎవరి కోసం వేశాడు.. అసలు అతను పోలీస్ గా ఎవరి స్థానంలో వెళ్లాడు అనేది మిగతా కథ అంటున్నారు.మరి ఇందులో నిజాలెన్నో కానీ, కథ లీక్ అయినా దాన్ని ఎంత ఇంట్రెస్టింగ్ గా చెప్పారు అనే దానిపైనే సక్సెస్ ఆధారపడి ఉంటుంది. కానీ ఓ స్టార్ హీరో సినిమా విడుదలకు ముందు ఇలాంటి కథలు చాలానే వినిపిస్తాయి. మరి అసలు కథేంటన్నది సినిమా చూస్తే కానీ తెలియదు.. కాకపోతే ఈ కథ వింటున్నవారిలో మాగ్జిమం నిజమే కావొచ్చేమో అనుకుంటున్న వారే ఎక్కువ కావడం విశేషం..

Post a Comment

 
Top