ఆ హీరోయిన్ ఆత్మహత్య చేసుకుంది
మోడలింగ్ రంగంలో కెరీర్ ఆరంభించి అడపాదడపా సినిమాలు
చేస్తున్న నటి అర్చనా పాండే ఆత్మహత్య చేసుకుంది. ముంబయి లోఖండ్ వాలా
ప్రాంతంలో ఉన్న నివాసంలో ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె ఓ
రెండ్రోజుల క్రితం ఆత్మహత్య చేసుకుని వుండవచ్చని వెర్సోవా పోలీస్ స్టేషన్
ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఆమె సూసైడ్ కు సంబంధించి వెర్సోవా పోలీస్
స్టేషన్ లో ఓ కేసు కూడా నమోదైంది. ఆమె నివాసం వుంటున్న ఇంట్లోంచి సోమవారం
భరించలేనంత దుర్వాసన వస్తుండటాన్ని గమనించిన ఇరుగుపొరుగు వెళ్ళి ఆమె ఇంటి
డోర్ బెల్ మోగించారు. ఎంతసేపూ లోపలి నుంచి రెస్పాన్స్ రాకపోవడంతో అనుమానం
వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. స్థానికులు
ఇచ్చిన సమాచారంతో సీన్‌లోకి ఎంటరైన పోలీసులు తలుపులు బ్రేక్ చేసి చూడగా లోపల ఆమె
మృతదేహం కనిపించింది. మృతదేహాం వద్ద ఓ సూసైడ్ నోట్ కూడా లభ్యమైంది. డెడ్
బాడీని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం కూపర్
ఆసుపత్రికి తరలించారు. ఆమె ఆత్మహత్యకి గల కారణాలు ఇంకా తెలియలేదని పోలీసులు
చెబుతున్నారు. మోడలింగ్ పరిశ్రమలోనే కాకుండా కొన్ని దక్షిణాది
సినిమాల్లోనూ నటించిన అర్చన పాండే గత కొంత కాలంగా డిప్రెషన్‌లో వున్నట్లు ఆమె
సన్నిహితమిత్రులు చెబుతున్నారు. డిప్రెషన్‌తోపాటు బాయ్ ఫ్రెండ్‌తో తలెత్తిన
విభేదాలు కూడా ఆమె ఆత్మహత్యకు ఓ కారణమై వుండవచ్చని పోలీసులు
భావిస్తున్నారు.
Post a Comment