GuidePedia

0


వాటి వల్లే గోవిందుడికి U/A

ప్రేక్షకాభిమానులు, ఇండస్ట్రీ వర్గాలు ఆత్రుతగా ఎదురుచూస్తున్న 'గోవిందుడు అందరివాడేలే' శుక్రవారం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది.  ఒక సాంగ్ షూట్ చేయకుండా కొన్ని ప్యాచ్ వర్క్స్ పెండింగ్‌తో సెన్సార్‌కు వెళ్ళిన 'గోవిందుడు'కు క్లీన్ U సర్టిఫికేట్ రాలేదని టాక్. కొన్ని " పెద్దల " మాటలు.. కృష్ణవంశీ మార్క్ రొమాన్స్ ఉన్నందున U/A  సర్టిఫికేట్ వచ్చిందని ఇన్‌సైడ్ టాక్. అందరూ చెబుతున్నట్టే మూవీని సెన్సార్ ప్రశంసించిందని యూనిట్ చెప్పడమే కాదు అన్నీ అనుకూలిస్తే బ్లాక్ బస్టర్ హిట్ దక్కుతుందని కూడా అన్నారని యూనిట్ టాక్. ఆడియో పరంగా చెర్రీ - కృష్ణవంశీ మార్క్‌కు చేరువకాని 'గోవిందుడు'కు యువన్ శంకర్ రాజా మ్యూజిక్ మైనస్ అనే వినిపిస్తోంది. సినిమాలో సత్తా ఉంటే ఇవన్నీ సైడ్ అవుతాయనే సంగతి తెల్సిందే కాబట్టి ఇక ఆశలన్నీ కృష్ణవంశీపై పెట్టి మెగా ఫ్యాన్స్ అక్టోబర్ 1 న సినిమా రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారని సమాచారం.

Post a Comment

 
Top