నాగార్జునని కాపీ కొట్టాడు !!
నాగార్జున స్టైల్ ని రామ్ చరణ్ కాపీ కొట్టాడని
అభిమానుల్లో ఓ
సరికొత్త ప్రచారం జరుగుతున్నది. గోవిందుడు అందరివాడేలే సినిమా విడుదలకి సిద్దం
అవుతున్న నేపధ్యంలో కొంతమంది అక్కినేని అభిమానులు ఈ వాదనను తెరపైకి తీసుకొచ్చారు
. అదేమిటంటే గతంలో నాగార్జున నటించిన రగడ సినిమాలో నాగ్ ఉపయోగించిన
కాస్ట్యూమ్ ని , అదే
స్టైల్ ని గోవిందుడు అందరివాడేలే సినిమాలో రామ్ చరణ్ కాపీ కొట్టాడని , తమ వాదనే నిజం
అని నిరూపించుకోవడానికి ఏకంగా రగడ సినిమా పోస్టర్ ని సైతం ఉదాహరణగా చూపిస్తున్నారు.
ఈ రెండు పోస్టర్స్ లలో ఉపయోగించిన కాస్ట్యూమ్స్ , ఫోజు
ఒకేతీరులో ఉడడంతో చరణ్ నాగార్జునని కాపీ కొట్టాడని అంటున్నారు.
ఇదిలా ఉంటె , ఇది
యాదృచ్చికంగా జరిగి ఉండొచ్చని కొంతమంది కొట్టిపారేస్తున్నారు. కాస్ట్యూమ్స్
విషయంలో ఒక్కో సందర్భంలో ఒక్కో ట్రెండ్ ఉంటుంది. ఆ సమయంలో ఎవరికీ నచ్చిన
కాస్ట్యూమ్స్ ని వారు ఎంచుకుంటారు. అంత మాత్రానికే కాపీ కొట్టారని నిర్ణయం
తీసుకుంటే ఎలా అనేది మరో వర్గం వారి వాదన. రామ్ చరణ్ హీరోగా కృష్ణవంశీ
దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా అక్టోబర్ 1 న ప్రేక్షకుల ముందుకు రానున్నది.
Post a Comment