GuidePedia

0


'' ఆడియో వేడుకలో హాలీవుడ్‌ నటుడు ఆర్నాల్డ్‌ ష్వార్జ్‌నెగ్గర్‌కర్‌.. మీరు అవకాశమిస్తే మీ చిత్రంలో నటించేందుకు నేను సిద్ధంగా ఉన్నా' అని హాలీవుడ్‌ నటుడు ఆర్నాల్డ్‌ తన మనోగతాన్ని వెల్లడించారు. శంకర్‌ దర్శకత్వంలో విక్రమ్‌ నటించిన '' చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం చెన్నైలో సోమవారం జరిగింది. కార్యక్రమానికి రజనీకాంత్‌ ముఖ్యఅతిథిగా పాల్గొని ఆడియో సీడీని విడుదల చేశారు. కన్నడ నటుడు పునీత్‌రాజ్‌కుమార్‌ తొలి సీడీని అందుకున్నారు.
ప్రత్యేక అతిథిగా హాజరైన అర్నాల్డ్‌ మాట్లాడుతూ
''భారతదేశంలో చాలా ప్రాంతాలకు వెళ్లాను. కానీ చెన్నైకి రావడం ఇదే ప్రథమం. వాస్తవానికి ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమానికి అతిథిగా హాజరుకాలేదు. శంకర్‌ వద్ద ఓ సినిమా అవకాశం కోసం వచ్చాను. 'శంకర్‌ మీ దర్శకత్వంలో నాకు నటించాలనుంది. మీరు సరేనంటే మనిద్దరం కలిసి తదుపరి చిత్రం చేద్దాం 'కెనాన్‌ బిక్కింగ్‌' లాంటి సినిమా మనమెందుకు చేయకూడదు?' అని శంకర్‌నుద్దేశించి వ్యాఖ్యానించారు. ''నేను ఓ బాడీబిల్డర్‌ దశనుంచి హీరోగా ఈ స్థాయికి ఎదగడం ఆనందంగా ఉంది. చెన్నై ప్రజల అభిమానం చూసి నిజంగానే ఉప్పొంగిపోతున్నాను. తప్పనిసరిగా ఓ మంచి ప్రాజెక్టుతో మళ్లీ దక్షిణాది ప్రేక్షకులను కలుస్తాననే నమ్మకం ఉంది'' అని ఆర్నాల్డ్‌ చెప్పారు.
రజనీకాంత్‌ మాట్లాడుతూ
''ఇప్పుడు శంకర్‌ '' హాలీవుడ్‌పై పడిందని అనుకుంటున్నాను. భారతీయ సినిమా పరిశ్రమను హాలీవుడ్‌ స్థాయికి తీసుకు వెళ్లాలనే ఉద్దేశంతో శంకర్‌ ఉన్నట్టు అనిపిస్తోంది. ఈ సినిమాలో ప్రతి ఫ్రేమ్‌ హాలీవుడ్‌ను తలపిస్తుంది. ఇక విక్రమ్‌లాంటి బాధ్యతాయుతమైన నటుడు మన దేశంలోనే కాదు, హాలీవుడ్‌లోనూ లేడనేది నా అభిప్రాయం. అంతగా విక్రమ్‌ ఈ సినిమా కోసం కష్టపడ్డాడు'' అన్నారు.
దర్శకుడు శంకర్‌ మాట్లాడుతూ  
''ఈ సినిమా కోసం ప్రత్యేకించి పలు హాలీవుడ్‌ కంపెనీలు పనిచేశాయి. ఆ ప్రతినిధులు షూటింగ్‌ చూసి ఇలాంటి సినిమాల్లో నటించడం విక్రమ్‌లాంటి నటుడికే సాధ్యమన్నారు. అంత అంకిత భావంతో విక్రమ్‌ నటించాడు'' అన్నారు.
విక్రమ్‌ మాట్లాడుతూ  
''శంకర్‌ లాంటి దర్శకుడి చిత్రంలో మళ్లీ నటించడం వరంగా భావిస్తున్నా. ఈ సినిమా ప్రపంచ సినీ చరిత్రలోనే ప్రత్యేకంగా నిలుస్తుంది. ఇప్పుడు మీ ముందు కన్పిస్తున్న 'మృగం' వంటి పాత్ర కోసం కనిష్టంగా మూడు గంటల పాటు మేకప్‌ వేసుకోవాల్సి ఉంటుంది. ప్రతిరోజు ఎంతో ఓర్పుతో మేకప్‌ వేసుకుని కెమెరా ముందుకెళ్లాను. ఇలాంటి సినిమాలో నటించడం ఓ సవాలు లాంటిదే. ఇలాంటి మరో నాలుగు పాత్రల్లో సినిమాలో కన్పిస్తాను. ఆర్నాల్డ్‌ లాంటి హాలీవుడ్‌ నటుడు, రజనీకాంత్‌ ఈ కార్యక్రమానికి రావడం గర్వంగా భావిస్తున్నా''నన్నారు.  

ఈ కార్యక్రమంలో హీరో విక్రమ్ వింత మృగం వేషం ధరించి వేదికపై ఒక పాటకు నటించడం విశేషం. అలాగే, ఏ.ఆర్. రెహ్మాన్, యువ సంగీత దర్శకుడు అనిరుధ్ సైతం ఆడియో ఆవిష్కరణ వేదికపై పాడారు. ఈ చిత్రాన్ని తెలుగులో కూడా పేరుతోనే విడుదల చేయనున్నారు. సూపర్ గుడ్ ఫిలింస్‌తో కలిసి ఆస్కార్ సంస్థే తెలుగులోనూ విడుదల చేయనుంది.

Post a Comment

 
Top