GuidePedia

0

ఇలియానా తనది అమ్ముకుంటుందటా...!

గోవా బ్యూటీ ఇలియానా టాలీవుడ్ కు గుడ్ బై చెప్పేందుకు రెడీ అవుతోంది. బక్కపలచని సుందరికి బాలీవుడ్ లో అవకాశాలు బాగానే వస్తుండడంతో తెలుగు చిత్రసీమ వైపు చూడడం మానేసింది. బర్ఫీచిత్రం ద్వారా హిందీలో ఎంట్రీ ఇచ్చిన ఇలియానాకు ఇప్పుడు చేతినిండా సినిమాలున్నాయి. కింగ్ ఖాన్ షారుక్‌ఖాన్ సరసన నటించే ఛాన్స్ దక్కించుకుందన్న వార్తలు విన్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టాలీవుడ్ కు టాటా చెప్పేయాలని భావిస్తోందట. దీనిలో భాగంగా హైదరాబాద్ లో తన ఇంటిని అమ్మకానికి పెట్టింది అమ్మడు.మణికొండలోని ల్యాంకో హిల్స్ లో ఆమెకు విలాసవంతమైన ఫ్లాట్ ఉంది. అప్పట్లో రూ.1.25 కోట్లకు కొన్న ఈ ఫ్లాట్ ధర ఇప్పుడు రూ.2 కోట్ల వరకు పలుకుతోందని అంటున్నారు. రాష్ట్ర విభజనతో మారిన పరిస్థితుల నేపథ్యంలో ఇంకా ఆలస్యం చేస్తే ధర పడిపోయే అవకాశమున్నందన ఇప్పుడే బేరం పెడితే మంచిదని ఆమె భావిస్తోందట. అదీకాక ఇలియానాకు ముంబైలోని బాంద్రా ప్రాంతంలో కోటి రూపాయలపైగా విలువ చేసే మరో ఫ్లాట్ ఉండడంతో హైదరాబాద్ ఆస్తిని వదులుకోవాలన్న నిర్ణయానికి వచ్చిందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు.ఫ్లాట్ బేరసారాల సంగతి ఇలియానా తల్లి సమీరా చూస్తున్నారట. ఇప్పటికే కొంతమంది కొనుగోలుదారులు ఆమెను సంప్రదించినట్టు తెలుస్తోంది. అన్నికుదిరితే త్వరలోనే ఇలియానా ఇల్లు చేతులు మారుతుందని చెప్పుకుంటున్నారు. అయితే ఇలియానా అభిమానులు మాత్రం ఆమె ఇక తెలుగులో నటించదా అన్న బాధను వ్యక్తం చేస్తున్నారు.

Post a Comment

 
Top