GuidePedia

0

వాళ్ళు ఉన్నది విప్పడనికేనా !!

హీరోయిన్లు విప్పి చూపటానికేనా ? సినిమాల్లో అందాలు ఆరబోయటానికేనా? వాళ్లకు సినిమాలో ప్రాముఖ్యత ఉండదా? అవునంటోంది ఓ సర్వే. భారత సినీ పరిశ్రమలోనే కాదు ప్రపంచ సినీ పరిశ్రమలోనూ భామలుకేవలం సరససల్లాపాలకే పరిమితమని తేల్చి చెప్పింది. అసలు వీరి పాత్రలకు ప్రాముఖ్యతలే ఉండదని చెబుతోంది. ముఖ్యంగా ఇండియన్‌ సినిమాల్లో హీరోయిన్లు కేవలం సెక్సీ భామలుగానే పరిగణిస్తారని స్పష్టం చేసింది. మాటలు తక్కువ , అందాలు ఆరబోయటం ఎక్కువని తెలిపింది. ప్రపంచ సినీ పరిశ్రమలో చూస్తే హీరోయిన్లు అందాలు ఆరబోసే విషయంలో మనం మూడో స్థానంలో ఉన్నాం. యూకె, యూఎస్‌ సినీ పరిశ్రమలు మొదటి రెండు స్థానాల్లో నిలిచాయి. సినీ పరిశ్రమలో ఏ విభాగం చూసుకున్నా మగవారి డామినేషన్‌ ఎక్కువగా ఉందని వివరించింది. అసలు సిసీ పరిశ్రమలో మహిళలకు ప్రాముఖ్యతే కాదు ప్రాధాన్యత కూడా లేదని తేల్చిసింది అ సర్వే.

Post a Comment

 
Top