బిడ్డను కన్న తర్వాతే పెళ్ళంటా !!
పెళ్లికి
ముందే బిడ్డను కంటానంటూ నటి శ్రుతీ హాసన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తండ్రి కమల్‌హాసన్‌ను అమితంగా ప్రేమిస్తూ, ఆయన బాటలోనే సినీ రంగానికి వచ్చిన శ్రుతి ఇప్పుడు వ్యక్తిగత జీవితంలోనూ అదే బాటలో
వెళుతున్నట్లు కనిపిస్తోంది. ఈ అందాల తార వద్ద
ఇటీవల పెళ్లి ప్రస్తావన తీసుకువచ్చినప్పుడు, దంపతులుగా చూస్తే తన తల్లిదండ్రులు అందమైన జోడీ అని పేర్కొన్నారు. ప్రేమానురాగాలతో నిండిన వారితో గడిపిన ఆ
రోజులు ఆనందమయంగా సాగాయని పేర్కొన్నారు. అంతేకాకుండా, తన
తల్లిదండ్రుల లాగానే తానూ పెళ్లికిముందే బిడ్డను కనాలని ఆశిస్తున్నట్లూ, ఆ తరువాతే
పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నట్లూ శ్రుతహాసన్ వ్యాఖ్యానించారు. ఆమె చేసిన ఈ సంచలన వ్యాఖ్యలు చిత్ర
పరిశ్రమలో చర్చనీయాంశమయ్యాయి. ఒక్కసారి
గతంలోకి వెళితే... బాలీవుడ్ నటి సారిక అప్పట్లో
వివాహానికి ముందే గర్భం దాల్చి ఆ తరువాత తన బిడ్డకు కమల్‌హాసన్ తండ్రి అని బహిరంగంగా ప్రకటించారు.
కమల్‌హాసన్
కూడా ఆమె మాటల్ని అంగీకరించారు. ఆ తరువాత కమల్‌హాసన్, సారిక వివాహం
చేసుకున్నారు. శ్రుతీహాసన్, అక్షర హాసన్‌లకు జన్మనిచ్చిన ఈ
దంపతుల మధ్య కొంత కాలానికి మనస్పర్ధలు
వచ్చాయి. దాంతో, కమల్ హాసన్ నుంచి సారిక విడిపోయారు. ప్రస్తుతం ఆమె ముంబయిలో నివసిస్తున్నారు. చిన్న
కూతురు అక్షర హాసన్ ఆమెతోనే ఉంటున్నా, శ్రుతీ హాసన్ ఒంటరిగా జీవిస్తున్నారు.తెలుగు, తమిళ, హిందీ భాషా
చిత్రాల్లో నటిస్తూ ప్రముఖ హీరోయిన్‌గా వెలుగుతున్నారు.
Post a Comment