GuidePedia

0

ఎన్టీఆర్ - నాగార్జున మూవీ లేదు !!

టాలీవుడ్‌ కింగ్‌ నాగార్జున, యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ కాంబినేషనల్లో వంశీ పైడిపల్లి డైరక్షన్‌ లో ఓ మల్టీస్టారర్‌ మూవీ వస్తోందని తెలుసు. అయితే ఇప్పుడు ఆ సినిమా ఆగిపోయినట్లు ఫిల్మ్‌ నగర్‌ న్యూస్‌. మనం సినిమా హిట్‌ తో నాగార్జున డిమాండ్‌ చేయటం బాగా పెరగిందట. అంతేకాకుండా ఆ కథలో తనకు ఎక్కువ ప్రాముఖ్యతనివ్వాలంటూ మార్పులు చేర్పులు సూచించాడట. ఇలా చేస్తే ఎన్టీఆర్‌ చేయాల్సిన పాత్రకు ఇంపార్టెంట్‌ లేకుండా పోతుందని దర్శకుడు చెప్పినప్పటికీ నాగ్‌ వినిపించుకోలేదట. తన డిమాండ్లు ఒప్పుకుంటేనే సినిమా లేదంటే తప్పకుంటానని తేల్చి చెప్పాడట నాగ్‌. ప్రస్తుతం నాగార్జున కొత్త సినిమాపై దృష్టిపెట్టాడు. కొత్త దర్శకుడు కల్యాణ్‌ కృష్ణా తో ఓ సినిమా చేస్తున్నాడు. ఇందులో నాగ్‌ డ్యుయల్‌ రోల్‌ పోషిస్తున్నాడు. ఇప్పటికే రమ్యకృష్ణ ఒక హీరోయిన్‌ గా సెలక్ట్‌ అవడంతో అమ్మడు బాడీని సెక్సీగా మలిచే పనిలో బిజీ అయ్యిందట. ఇక నాగ్‌ రెండో పాత్ర కోసం హీరోయిన్‌ ని సెలక్ట్‌ చేయాల్సి ఉంది. అన్నపూర్ణ బ్యానర్‌ పై తెరకెక్కబోతున్న ఈ సినిమా త్వరలోనే ప్రారంభం కానుంది.

Post a Comment

 
Top