GuidePedia

0

ఆంధ్రప్రదేశ్ లో పవన్ ఫిలిం స్టూడియో !!

ఆంధ్రప్రదేశ్‌కి కొత్త రాజధాని ప్రకటన వెలువడడంతో.. ఫిల్మ్ఇండస్ర్టీకి చెందిన కొంతమంది ప్రముఖులు ఏపీ వైపు దృష్టి పెట్టారు. మేజర్ సిటీస్‌లో భూముల ధరలు ఆకాశాన్ని తాకడంతో రాజధానికి పొరుగునున్న జిల్లాలపై నిర్మాతలు, హీరోలు ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. సొంతంగా ఇళ్లను నిర్మించుకునేందుకే కాకుండా స్టూడియోలనూ రెడీ చేసేందుకు స్కెచ్ వేసినట్లు వార్తలు వెలువడుతున్నాయి. తాజాగా వెస్ట్ గోదావరి జిల్లాలో మెగా స్టూడియోను నెలకొల్పడానికి పవన్‌కల్యాణ్ ప్లాన్ చేస్తున్నట్లు ఇన్‌సైడ్ టాక్. ఇప్పటికే నర్సాపురం- పైడిపాలెం ప్రాంతాల మధ్య ఈ స్టూడియోని నిర్మించాలని అనుకుంటున్నాడట. దీనికి సంబంధించి స్థలాన్ని పరిశీలించినట్లు ప్రచారం సాగుతోంది. ఈ విషయమై పవన్‌కల్యాణ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడితో మాట్లాడి ఓకే చేసుకున్నాడని ఫిల్మ్‌నగర్‌లో చెప్పుకుంటున్నారు. స్టూడియోని నిర్మించడమేకాదు సమీపంలోని కొన్ని గ్రామాలను దత్తత తీసుకుని డెవలప్ చేయాలని ఈ హీరో భావిస్తున్నాడట. దీనిపై మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి.

Post a Comment

 
Top