GuidePedia

0


అదిరిపోయే ఫీచర్స్ తో ఐఫోన్ 6!




గాడ్జెట్ లవర్స్ ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న ఐఫోన్ 6 రిలీజ్ అయింది. యాపిల్ కంపెనీ ఐఫోన్ 6, ఐఫోన్ 6 ప్లస్‌లను మంగళవారం అర్ధరాత్రి రిలీజ్ చేసింది. వీటితో పాటు స్మార్ట్ ఐవాచ్‌ను కూడా కంపెనీ సీఈవో టిమ్ కుక్ లాంచ్ చేశారు. ఐ ఫోన్ 6 స్క్రీన్ సైజ్ 4.7 ఇంచెస్ ఉండగా, ఐఫోన్ 6 ప్లస్‌లో 5.5 ఇంచుల స్క్రీన్ ఉంటుంది.ఈ నెల 12 నుంచి బుకింగ్‌లు స్టార్ట్ అవుతాయ్. ఈ నెల 19 నుంచి డెలివరీలు స్టార్ట్ చేస్తారు. యాపిల్ కంపెనీ ఈ రెండు ఫోన్లను ఏ8 చిప్‌తో తయారు చేసింది.ఇంతకు ముందటి ఐఫోన్‌లలోని చిప్‌లతో పోల్చితే ఇది 25% ఫాస్ట్ గాను, 50 % బెటర్ గానూ పనిచేస్తుందని కంపెనీ ప్రతినిధులు చెప్పారు. ఐఫోన్ 6లో 6.9 ఎంఎం మందం, 8 మెగా పిక్సెల్ రియర్ కెమెరా వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. 14 గంటల టాక్‌టైమ్, 11 గంటల వీడియో, 10 రోజుల స్టాండ్‌బై, 4జీని సపోర్ట్ చేస్తుంది. ధరలు 16 జీబీ మోడల్ 199 డాలర్లు, 299 డాలర్లు(64 జీబీ), 399 డాలర్లు(128 జీబీ).
ఇక ఐఫోన్ 6ప్లస్‌లో 7.1 ఎంఎం మందం, రెటీనా డిస్‌ప్లే హెచ్‌డీ, 16 గంటల స్టాండ్‌బై టైమ్, 14 గంటల వీడియో ప్లేబ్యాక్, 8 మెగాపిక్సెల్ ఐసైట్ కెమెరా వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. ధరలు 16 జీబీ మోడల్ 299 డాలర్లు, 399 డాలర్లు(64 జీబీ),499 డాలర్లు(128 జీబీ).
యాపిల్ రిలీజ్ చేసిన స్మార్ట్ వాచ్ ప్రతి సారి పాకెట్ లోంచి ఫోనే తీయవలసిన అవసరం లేకుండా చేస్తుంది. కాల్ అలర్ట్స్, మెస్సేజ్ అలర్ట్స్ ను వాచ్ స్క్రీన్ పై డిస్ ప్లే చేస్తుంది. అంతేగాక ఈ వాచ్ తో సాంగ్స్ కుడా వినొచ్చు.



Post a Comment

 
Top