GuidePedia

0

తెలుగులో పవర్ స్టార్ కొడుకు సినిమా !!

పవన్ కల్యాణ్ అభిమానులకు గుడ్ న్యూస్. తమ అభిమాన నటుడి తనయుడు అకీరాను వెండితెరపై వీక్షించే అవకాశం కలుగనుంది. పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ స్వీయ దర్శకత్వంలో 'ఇష్క్ వాలా లవ్' అనే మరాఠీ చిత్రాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే. ఇందులో అకీరా గెస్ట్ పాత్రలో నటించాడు.  కాగా, పవన్ అభిమానుల కోసం ఈ చిత్రాన్ని ఆమె తెలుగులోకి డబ్ చేస్తోంది. ఈ విషయాన్ని తాజాగా రేణు ఫేస్ బుక్ ద్వారా తెలియజేసింది. "ఇష్క్ వాలా లవ్ చిత్రాన్ని తెలుగులోకి డబ్ చేస్తున్నాం. ప్రస్తుతం ఆ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేస్తాం" అంటోంది రేణు. పవన్ ఇమేజ్ కారణంగా తెలుగులో ఈ సినిమాకు మంచి బిజినెస్ జరుగుతుందన్న ఆలోచనతో రేణు దేశాయ్ వుంది.

Post a Comment

 
Top