నటనకు సమాంత గుడ్ బై !!
తమిళ దర్శకుడు గౌతం మీనన్ ద్వారా తెలుగు తెరకి పరిచయం
అయినది సమంత. ఏమాయ చేశావే సినిమాతో యువ ప్రేక్షకులకు బాగా దగ్గరైన ఈ అమ్మడుకి
టాలీవుడ్ పరిశ్రమ రెడ్ కార్పెట్ వేసి ప్రోత్సహించింది. తెలుగు అగ్ర హీరోయిన్స్
అందరితో పోటీపడి మరి నటించి సినిమా సినిమాకి తన క్రేజ్ పెంచుకుంటూ నెంబర్ వన్
స్థానానికి చేరింది. అయితే ఈ అమ్మడు ఇప్పుడు అందరిని నిరాశపరిచే విధంగా కొత్త స్టేట్మెంట్స్
ఇస్తుంది. సమంత నటనకు ఇకపై స్వస్తి చెప్పనున్నదట. నేరుగా చెప్పకుండా తను ఫెడ్ అవుత
అయ్యాక సినిమా నుంచి తపుకోవడం కంటే అగ్రస్థానంలో ఉండగానే నటనకు గుడ్ బై చెప్పి
సినిమాలకు దూరంగా ఉంటానని చెప్పుకొచ్చింది. ఇప్పటివరకు పరిశ్రమలో చాలా కష్టతరమైన
పరిస్థితులను ఎదుర్కొంటూ, వాటిని తట్టుకునే శక్తి ఇక తనకు లేదని సమంత
తన స్నేహితులతో చెబుతుందట. ఇదివరకు అయితే సన్నిహితులు బలవంతం మేరకు ఇంకా సినిమాలు చేస్తున్నా
, విజయాలు , అవకాశాలు తనని విడిచి
వెళ్ళక ముందే సమంత వాటిని విడిచి వెళ్ళిపోవడానికి నిర్ణయం తీసుకుందని ఆమెన్
సన్నిహితుల నుంచి అందుతున్న సమచారం.
Post a Comment