చేకోడి రేటింగ్ : 2.5 /5
చిత్రం : పవర్
బ్యానర్ : రాక్ లైన్
ఎంటర్ టన్మెంట్స్ ప్రై.లిమిటెడ్
దర్శకుడు : కె.ఎస్. రవీంద్ర
(బాబీ)
నిర్మాత : రాక్ లైన్
వెంకటేష్
సంగీతం : ఎస్.ఎస్. థమన్
ఛాయాగ్రహణం : జయంత్
విన్సెంట్
ఎడిటర్ : గౌతంరాజు
నటినటులు : రవితేజ,
రెజీనా, హన్సిక, బ్రహ్మానందం,
సప్తగిరి, అజయ్, బ్రహ్మాజీ
తదితరులు...
బలుపు చిత్ర విజయం తర్వాత దాదాపు ఒక సంవత్సరం పైగా గ్యాప్
తీసుకున్న తర్వాత మాస్ మహారాజ్ రవితేజ చేసిన పక్కా మాస్ ఎంటర్టైనర్ ‘పవర్’. గతంలో డాన్ శ్రీను, మిస్టర్ ఫర్‌ఫెక్ట్, బలుపు చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న బాబీ (కే ఎస్ రవీంద్ర) పవర్
చిత్రంతో దర్శకుడి అవతారం ఎత్తారు. హన్సిక, రెజీనాలతో కలిసి
రవితేజ, బాబీలు పవర్ చూపించారా అనే విషయాన్ని తెలుసుకోవాలంటే
కథలోకి వెళ్లాల్సిందే.
కథ : కోల్ కథా లో
అత్యంత అవినీతి పరుడైన ఎ సి పి బలదేవ్ (రవితేజ )… ఓ
కేసు విచారణ కోసం కోర్ట్ కి తీసుకెళ్తున్న
క్రిమినల్ ని పోలీస్ ల నుంచి తప్పిస్తాడు. ఆ ప్రాసెస్ లో ప్రాణాలు కోల్పోతాడు.
అక్కడితో కథ హైదరాబాద్ కి వస్తుంది. ఇక్కడ తిరుపతి (రవితేజ ) అనే ఓ యువకుడు (?)
అచ్చం ఎ సి పి బలదేవ్ పోలికలతో ఉన్నవాడు ఎప్పటికైనా ఖాకీ డ్రెస్
వేసుకోవాలని తపించి పోతుంటాడు. ఆల్రెడీ ఇన్స్పెక్టర్ అయిన తన బావ డ్రెస్ , లాఠీ తో పాటు డ్యూటీ కూడా చేసేస్తూ ఉంటాడు . వీడిని ఓ తెలుగు న్యూస్ ఛానల్
లో కోల్ కథా లో ఉన్న ఆ స్టేట్ హోం మినిస్టర్ చూస్తాడు. సరా సరి కోల్ కథా
తీసుకెళ్ళి బలదేవ్ ప్లేస్ లో ఎ సి పి గా అప్పాయింట్ చేస్తాడు. ఆ తర్వాత వీడి కథ ఏ
మలుపు తిరిగింది ? వీడి అసలు పోస్టర్ ఎ సి పి ఎక్కడున్నాడు?
వాడు ఎందుకు కరప్ట్ అయ్యాడు ? ఆ కరప్ట్ మనీ తో
ఏం ఉద్దరిస్తున్నాడు ? అనేది మిగతా కథ .
హీరో : బలదేవ్ సహాయ్, తిరుపతి పాత్రల్లో రవితేజ కనిపించారు. బలదేవ్ పాత్రద్వారా యాక్షన్‌ను,
తిరుపతి పాత్ర ద్వారా ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందించడంలో రవితేజ తన
మార్కును పండించారు. గతంలో విక్రమార్కుడు, బలుపు ఇతర చిత్రాల
ఛాయలు అక్కడక్కడ కనిపిస్తాయి. కేవలం రవితేజను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన పాత్రలకు
ఆయన పూర్తి న్యాయం చేకూర్చాడు. తన ఇమేజ్‌కు సరిపోయే పాత్రలతో రవితేజ మరోసారి
అభిమానులను ఆకట్టుకున్నాడని చెప్పవచ్చు.
హీరోయిన్లు
: నిరుపమ
పాత్రలో హన్సిక, వైష్ణవిగా (రెజీనా)లు నటించారు. తొలిభాగంలో
హన్సిక, రెండవ భాగంలో రెజీనా తమ గ్లామర్‌తో ఆలరించారు. కథకు
తోడ్పాటు నందించే పాత్రలో హన్సిక కనిపించగా, కథను ముందుకు
తీసుకెళ్లే పనిని రెజీనా చేశారు. అయితే ఈ సినిమా ద్వారా ఇద్దరు హీరోయినక్లు అంత
గొప్పగా పేరు తెచ్చే పాత్రలేమి దక్కలేదు.
ఇతరులు
: ఆణిముత్యం పాత్రలో బ్రహ్మనందం రొటీన్ కామెడీ
చేసారు. ఆణిముత్యం పాత్ర కథలో ప్రధాన భాగమవ్వడమే కాకుండా ఈ చిత్రానికి అదనపు బలాన్ని
ఇచ్చింది.. ఈ మధ్ కాలంలో తనదైన మార్కు కామెడీతో పలు విజయాల్లో
పాలుపంచుకుంటున్న సప్తగిరి కామెడీ ఈ సినిమాలో అంతగా పేలలేదు. విలన్లుగా సంపత్, ముఖేశ్ రుషిలు
ఫర్వాలేదనిపించగా, పోలీస్ ఆఫిసర్లుగా అజయ్, బ్రహ్మజీ, సుబ్బరాజులు తమ పాత్రల పరిధి మేరకు ఓకే
అనిపించారు. అతిధి పాత్రకే ప్రకాశ్‌రాజ్ పరిమితమయ్యారు.
సాంకేతిక వర్గం : రొటిన్ కథకు మోహన కృష్ణ, కే చక్రవర్తితో
కలిసి కోన వెంకట్ అందించిన మాటలు అక్కడక్కడా బుల్లెట్‌లా పేలాయి. రవితేజ ఎనర్జీకి,
కథకు తగినట్టుగా మాటలతో కోన ఆకట్టుకున్నారు. మిర్చి తో డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకున్న కొరటాల శివను కె
. ఎస్ . రవీంద్ర బాగా ఫాలో అయినట్టున్నాడు. రవితేజ కాస్ట్యూమ్స్ , లుక్స్ చాలా బాగా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నాడు. ఆ విషయం లో సక్సెస్
అయ్యాడు. డైరెక్షన్ కూడా బాగానే ఉంది. క్లైమాక్స్
పక్కన పెడితే కథనం కూడా బాగానే రాసుకున్నాడు. కథ కొత్తది కాదు కాబట్టి ప్రత్యేకంగా
ఏమీ చెప్పలేం. జయనన్ విన్సెంట్‌తో కలిసి ఆర్థర్ విల్సన్ ఫోటోగ్రఫి బాగుంది. కోన
వెంకట్ డైలాగ్స్ అక్కడక్కడా పేలాయి. థమన్
మ్యూజిక్ అతని స్టైల్ లోనే ఉంది. రవితేజ
పాడిన నౌటంకి పాట వినడానికే కాకుండా తెరపై చూడటానికి కూడా బాగుంది. ఇతర పాటలు కూడా
ఆకట్టుకున్నాయి.
ప్లస్ పాయింట్స్ :
·
రవితేజ
·
నౌటంకి సాంగ్
·
హీరోయిన్స్ గ్లామర్
డ్రా బాక్స్ :
·
రొటీన్ కథ
·
క్లైమాక్స్
చివరిగా : ఇప్పటివరకూ
… కాదు కాదు… రీసెంట్ గా వచ్చిన పోలీస్ సినిమా లన్నీ
ముందు పెట్టుకుని ట్విస్ట్ లు , కథనం అల్లుకుని తయారు చేసిన
కథ ఇది. శంకర్ జెంటిల్ మాన్ నుంచి విక్రమార్కుడు లాంటి తెలుగు సినిమాల వరకూ చాలా
సినిమాలు గుర్తొస్తాయి. బలుపు క్లైమాక్స్ లో కామెడీ డాన్స్ క్లిక్ అవడం తో ఈ
సినిమా క్లైమాక్స్ కూడా అదే విధంగా డిజైన్ చేశారు. కానీ ఆ క్లైమాక్స్ మైనస్ అయింది.
పాత సినిమా సీన్ లు గుర్తొస్తున్నప్పుడు ప్రేక్షకులలో ఒకరిద్దరు కాపీ పేస్టు అనడం…
ఈ సీన్స్ కు కూడా నవ్వుకోవడం(వ్యంగ్యంగా) పక్కనపెడితే మాస్టర్ రైటర్
కోన వెంకట్ మళ్ళీ తన ప్రతిభ చూపించినట్టే. చాలా వరకు మేనేజ్ చేయగలిగాడు. కానీ
లాస్ట్ లో ఇంకేమీ చేయలేక… ముగింపు
మాత్రం మరీ ముతకగా ప్లాన్ చేశారు. రవితేజ అభిమానులు ఈ సినిమాని ఎంజాయ్ చేస్తారు
కానీ మిగతా వారే సెకండాఫ్ లో కాస్త నిరుత్సాహపడతారు. ఓవరాల్ గా ప్రస్తుతం బాక్స్
ఆఫీసు వద్ద ఎలాంటి సినిమా లేకపోవడం, ఇదొక కమర్షియల్ మాస్
ఎంటర్టైనర్ కావడం వలన ఫస్ట్ వీక్ కలెక్షన్స్ రాబట్టుకునే అవకాశం ఉంది.
Post a Comment