GuidePedia

0

ఐ తెలుగు ఆడియోకి జాకి చన్, చిరు, కెసిఆర్ !!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్, మెగాస్టార్ చిరంజీవి, యాక్షన్ హీరో జాకీచాన్ ఒకే వేదికపై కనిపిస్తే ఎలా ఉంటుంది? కన్నులపండువగా ఉంటుంది కదూ! ఈ అరుదైన సన్నివేశాన్ని త్వరలో  చూడవచ్చు. విశ్వసనీయ సమాచారం మేరకు అంతర్జాతీయ స్టార్ హీరో జాకీచాన్ హైదరాబాద్ రానున్నారు. దర్శకుడు శంకర్ తాజా సినిమా '' తెలుగు ఆడియో వేడుకలో జాకీచాన్ పాల్గొననున్నారు. కేసీఆర్, చిరులతో కలసి జాకీచాన్ ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఈ చిత్ర నిర్మాత ఈ ముగ్గురికి ఆహ్వానం పంపినట్టు ఫిలింనగర్ వర్గాలు చెబుతున్నాయి. జాకీచాన్ రెండు రోజుల్లో ఓకే చెప్పవచ్చని తెలిపారు. అక్టోబర్ రెండో వారంలో ఈ వేడుక నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఐ సినిమాలో విక్రమ్, అమీ జాక్సన్ నటించారు.

Post a Comment

 
Top