GuidePedia

0

తన వ్యతిరేక సినిమాపై రజిని కేసు !!

తన పేరుతో హిందీలో సినిమా నిర్మించడంపై తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. 'మై హూ రజనీకాంత్' హిందీ సినిమాపై అభ్యంతరం వ్యక్తం చేశారు. తన పేరుతో నిర్మించిన ఈ సినిమాను అడ్డుకోవాలంటూ మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.తన పేరు సినిమాకు పెట్టే ముందు అనుమతి తీసుకోలేదని వెల్లడించారు. తన పేరును దుర్వినియోగం చేశారని ఆయన ఆరోపించారు. రజనీకాంత్ పిటిషన్ పై విచారణ ప్రారంభించిన కోర్టు 'మై హూ రజనీకాంత్' విడుదలపై మధ్యంతర స్టే ఇచ్చింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 22కు వాయిదా వేసింది.

Post a Comment

 
Top