GuidePedia

0

వచ్చే ఏడాది అనుష్క పెళ్లి !!

అనుష్క మ్యారేజ్ గురించి రకరకాల గాసిప్స్ కంటిన్యూ అవుతున్నాయి. బాహుబలిప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత ఈమె పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించి చకచకా పనులు కూడా జరిగిపోతున్నాయి. ఇప్పటికే అనుష్క పేరెంట్స్ కాబోయే అల్లుడిని చూసినట్లు తెలుస్తోంది. అమెరికాలో బిజినెస్‌ చేస్తున్నాడట. అంతేకాదు హీరోయిన్‌కి దగ్గర బంధువు కూడా! టాలీవుడ్‌తోపాటు కోలీవుడ్‌లో అనుష్క కీలకమైన మూడు ప్రాజెక్టులు చేస్తోంది. ఇప్పటికే రుద్రమదేవి షూటింగ్ పూర్తయ్యింది. ఇక ప్రభాస్- బాహుబలి, రజనీకాంత్ - లింగా, అజిత్‌తో మరోమూవీ కూడా సెట్స్‌పై వుంది. ఈ మూడు వచ్చే ఏడాది మార్చి చివరినాటికి పూర్తయ్యే అవకాశాలున్నాయి. వచ్చే నవంబర్‌కి ఈ బ్యూటీ 33వ ఏటలోకి అడుగుపెట్టబోతోంది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఏప్రిల్ లేదా మే లో మ్యారేజ్ చేసుకుని లైఫ్‌లో సెటిలైపోవాలని ఈ అమ్మడు భావిస్తున్నట్లు ఫిల్మ్ సర్కిల్స్‌ టాక్. 

Post a Comment

 
Top